Massive Planet Identify : బృహ‌స్ప‌తి కంటే అతి పెద్ద గ్ర‌హం

అంత‌రిక్షంలో బృహ‌స్ప‌తి కంటే అతి పెద్దదైన గ్రహం ఉన్నట్లు గుర్తించారు. ఈ భారీ గ్ర‌హం జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌కు చిక్కింది. ఈ భారీ గ్ర‌హాన్ని హెచ్ఐపీ 65426 బీగా పిలుస్తున్నారు. ఈ గ్ర‌హం నివాస‌గ‌యోగ్యం కాద‌ని ప‌రిశోధ‌కులు తేల్చారు. దీనిపై రాతి ఉప‌రిత‌లాలు లేవ‌ని గుర్తించారు.

Massive Planet Identify : బృహ‌స్ప‌తి కంటే అతి పెద్ద గ్ర‌హం

Massive Planet Identify

Massive Planet Identify : అంత‌రిక్షం..ఓ అంతుచిక్క‌ని ర‌హస్యం. సుదూర విశ్వంలో ఎన్నో వింత‌లు, విశేషాలు. ఈ ర‌హ‌స్యాల గుట్టు విప్పేందుకు శాస్త్ర‌వేత్త‌లు అను నిత్యం శ్రమిస్తూనేవుంటారు. తాజాగా అంత‌రిక్షంలో బృహ‌స్ప‌తి కంటే అతి పెద్దదైన గ్రహం ఉన్నట్లు గుర్తించారు. ఈ భారీ గ్ర‌హం జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌కు చిక్కింది.

ఈ భారీ గ్ర‌హాన్ని హెచ్ఐపీ 65426 బీగా పిలుస్తున్నారు. ఈ గ్ర‌హం నివాస‌గ‌యోగ్యం కాద‌ని ప‌రిశోధ‌కులు తేల్చారు. దీనిపై రాతి ఉప‌రిత‌లాలు లేవ‌ని గుర్తించారు. ఇది ద్ర‌వ్య‌రాశిప‌రంగా బృహ‌స్ప‌తి కంటే 12 రెట్లు పెద్ద‌ద‌ని నిర్ధారించారు. ఈ గ్ర‌హం వ‌య‌స్సు 15-20 మిలియన్ ఏళ్ల మ‌ధ్య ఉంటుంద‌ని తేల్చారు.

Super-Earth TOI-1452 b : భూమికంటే 70 రెట్లు పెద్ద ‘మహాభూమి’ .. అక్కడ సంవత్సరం అంటే 11 రోజులే…

దీనితో పోలిస్తే భూమి చాలా చిన్న‌ది. భూ గ్ర‌హం వ‌య‌స్సు 4.5 బిలియ‌న్ సంవ‌త్స‌రాలు మాత్ర‌మే. కాగా, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన చిత్రంలో హెచ్ఐపీ 65426 బీ గ్ర‌హం ఇన్‌ఫ్రారెడ్ లైట్ విభిన్న బ్యాండ్లలో మెరుస్తూ క‌నిపిస్తోంది.