భూమి నచ్చలేదా? ఇంతకన్నా బాగున్న 24 గ్ర‌హాలను గుర్తించిన సైంటిస్టులు.

  • Published By: nagamani ,Published On : October 8, 2020 / 02:26 PM IST
భూమి నచ్చలేదా? ఇంతకన్నా బాగున్న 24 గ్ర‌హాలను గుర్తించిన సైంటిస్టులు.

solar system: ఈ అనంత విశ్వంలో మనిషికి తెలియని రహస్యాలు..వింతలు..విశేషాలు దాగి ఉన్నాయి. టెక్నాలజీని డెవలప్ చేసిన మనిషి కనుగొనలేని ఎన్నో రహస్యాలను ఈ అనంత విశ్వం తనలో దాచుకుంది. ఈ విశ్వంలో భూమి ఒక్కటే ఉందా? జీవానానికి ప్రాణాధారమైన నీరు..పచ్చని చెట్లు..గాలి ఇలా భూమ్మీద మనిషితో పాటు లక్షలాది…కోట్లాది జీవాలు జీవించటానికి కావాల్సిన అనేక వనరులున్నాయి.


కానీ ఆ వనరుల్ని మనిషి చేజేతులా నాశనం చేసుకుంటున్నాడు. పర్యావరణానికి ప్రమాదకారిలా మనిషి మారిపోతున్నాడు. ఈ పరిస్థితుల్లో మనిషి బ్రతటానికి అవసరమైన గ్రహాల కోసం మనిషి అన్వేషిస్తున్నాడు. ఈ అన్వేషణ నిరంతరం కొనసాగుతోంది.


భూమిలాంటి గ్రహాలు ఈ విశ్వంలో ఉన్నాయా? ఉంటే ఆ గ్రహాల్లో ప్రాణుల జీవ‌నానికి అనుకూల‌మైన ప‌రిస్థితులు ఉన్నాయా? అన్న ప్ర‌శ్న‌లకు స‌మాధానాన్ని వెతుకుతూ ఖ‌గోళ ప‌రిశోధ‌కులు త‌మ ప్ర‌య‌త్నాల‌ను కొన‌సాగిస్తూనే ఉన్నారు. ఈ అన్వేషణలో ఓ కీల‌క విష‌యాన్ని గుర్తించారు పరిశోధకులు. వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్త డిర్క్ షుల్జ్-మకుచ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం మన సౌర వ్యవస్థ వెలుపల 24 గ్రహాలను గుర్తించింది.


మ‌నిషి మనుగడకు అనుకూలమైన‌ భూమిని మించిన 24 గ్రహాలను క‌నిపెట్టారు. వాట‌న్నింటిలో జీవరాశి వృద్ధికి భూమి కన్నా మెరుగైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. వాషింగ్టన్‌ స్టేట్‌ యూనివర్సిటీ అధ్యయనంలో పరిశోధకులు గుర్తించిన ఈ వివ‌రాల‌ను ఆస్ట్రాలజీ వెబ్‌ జర్నల్‌ ప్రచురించింది. భూమికి వంద కాంతి సంవత్సరాల దూరంలో ఈ గ్ర‌హాల‌న్నీ ఉన్నాయని..భూమి కంటే అవి చాలా పురాతనమైనవనీ..భూమికంటే ప‌రిమాణంలో పెద్దవిగా ఉన్నాయ‌ని చెప్పారు.


ఆయా గ్ర‌హాల్లో భూమి కంటే వేడి వాతావరణం..తేమ ఉందని తెలిపారు. ఆయా గ్రహాలు తిరిగే కక్ష్యల‌కు ద‌గ్గ‌ర్లో ఉండే నక్షత్రాలు సూర్యుడి కన్నా మెరుగ్గా ఉన్నాయని చెప్పారు. వాటి జీవితకాలం కూడా సూర్యుడి కన్నా చాలా ఎక్కువని తమ పరిశోధనలో తేల్చారు. ఈ క్రమంలో వాటిల్లో జీవరాశి సులభంగా వృద్ధి చెందుతుందని..ఖ‌గోళ శాస్త్ర‌వేత్త‌ల భవిష్య‌త్తు పరిశోధనలకు ఈ అధ్యయనం ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని చెప్పారు.