Global Warming : పెరుగుతున్న భూతాపం.. మానవాళికి శాపం

పారిశ్రామిక విప్లవం ముందునాటి సగటు కంటే 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ కు మించి ఉష్ణోగ్రతలను పెరగనివ్వరాదన్న పారిస్ ఒప్పంద లక్ష్యాన్ని చేరుకోవాలంటే మునుపెన్నడూ లేనిస్థాయిలో సత్వర చర్యలు చేపట్టాలని సూచించారు.

Global Warming : పెరుగుతున్న భూతాపం.. మానవాళికి శాపం

global warming

Dangerous For Humanity : పెరుగుతున్న భూతాపం మానవాళికి శాపంగా మారుతోంది. భూతాపం మానవాళిని కబళించే రోజు ఎంతో దూరం లేదంటూ శాస్త్రవేత్తలు అత్యంత తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. ప్రతి దశాబ్దానికి భూమి రికార్డు స్థాయిలో 0.2 డిగ్రీలు వేడెక్కుతోందని గుర్తించారు. ప్రపంచ వ్యాప్తంగా 50మంది శాస్త్రవేత్తలు భూ ఉష్ణోగ్రతపై అధ్యయనం చేశారు.

మానవ చర్యలు, గ్రీన్ హౌజ్ వాయువుల ఉద్గారం భూతాపానికి కారణమవుతున్నట్లు కనుగొన్నారు. శిలాజ ఇంధనంతో నడిచే అన్ని మౌలిక సదుపాయాలను కొనసాగిస్తే పారిశ్రామిక కాలం నుంచి భూమి ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెంటిగ్రేడ్ కు పెరిగిపోతుందని, ఇది చాలా ప్రమాదకరమని తేల్చారు.

Tunisian coast boats capsized:ట్యూనీషియా తీరంలో 3 పడవలు బోల్తా..ఐదుగురి మృతి, పలువురి గల్లంతు

పారిశ్రామిక విప్లవం ముందునాటి సగటు కంటే 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ కు మించి ఉష్ణోగ్రతలను పెరగనివ్వరాదన్న పారిస్ ఒప్పంద లక్ష్యాన్ని చేరుకోవాలంటే మునుపెన్నడూ లేనిస్థాయిలో సత్వర చర్యలు చేపట్టాలని సూచించారు.

2035 నాటికి ప్రపంచం తమ గ్రీన్ హౌజ్ వాయు ఉద్గారాల్లో 60శాతానికి తగ్గించుకోవాల్సి ఉంటుందని అధ్యయనానికి నేతృత్వం వహించిన లీడ్స్ వర్సిటీ ప్రొఫెసర్ పియర్స్ ఫాస్టర్ వెల్లడించారు.