ఫోన్ ఎలా తయారైందంటే : సైంటిస్టులు ఏం చేశారో చూడండి

స్మార్ట్ ఫోన్.. ప్రతి ఒక్కరి అరచేతిలో కామన్ అయిపోయింది. స్మార్ట్ ఫోనే జీవితంగా మారింది. తిండి లేకపోయిన పర్వాలేదు.. కానీ, క్షణం ఫోన్ లేకుంటే పిచ్చిపట్టినట్టుగా ప్రవర్తిస్తారు.

  • Published By: sreehari ,Published On : March 15, 2019 / 01:37 PM IST
ఫోన్ ఎలా తయారైందంటే : సైంటిస్టులు ఏం చేశారో చూడండి

స్మార్ట్ ఫోన్.. ప్రతి ఒక్కరి అరచేతిలో కామన్ అయిపోయింది. స్మార్ట్ ఫోనే జీవితంగా మారింది. తిండి లేకపోయిన పర్వాలేదు.. కానీ, క్షణం ఫోన్ లేకుంటే పిచ్చిపట్టినట్టుగా ప్రవర్తిస్తారు.

స్మార్ట్ ఫోన్.. ప్రతి ఒక్కరి అరచేతిలో కామన్ అయిపోయింది. స్మార్ట్ ఫోనే జీవితంగా మారింది. తిండి లేకపోయిన పర్వాలేదు.. కానీ, క్షణం ఫోన్ లేకుంటే పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తారు. మార్కెట్లోకి ఏదైనా కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చిందంటే చాలు.. ఫీచర్లు ఎలా ఉన్నాయి.. డిజైన్, ధర ఎలా ఉంది తెలుసుకొని మరి కొనేస్తారు. ఎంతో ముచ్చటపడి కొనుకున్న ఫోన్ ఎలా తయారైంది అని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఫోన్ తయారీకి ఎలాంటి ఎలక్ట్రానిక్ ఎలిమెంట్స్ ను వాడుతారో తెలుసా? చూడటానికి స్మార్ట్ గా కనిపించే ఫోన్ లోపల ఏమున్నాయో తెలుసుకోవాలనుందా? మీరే కాదు.. సైంటిస్టులు కూడా తెలుసుకోవాలనుకున్నారు.. ఇంతకీ సైంటిస్టులు చేసిన పనింటో తెలుసా? ఓ స్మార్ట్ ఫోన్ తీసుకొని ఏకంగా బ్లెండర్ (మిక్సీ)లో వేశారు. స్విచ్ ఆన్ చేసి చూడగా.. బ్లెండర్ లో ఆ ఫోన్.. గిర్రు గిర్రున తిరుగుతూ ముక్కలు ముక్కలు అయిపోయింది. బాంబు పేలినప్పుడు ఎలా ఉంటుందో అలా కనిపించింది. 
Read Also: మన బడ్జెట్ లో : రూ.10వేల లోపు.. టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే..

బ్లెండర్ లో ముక్కలైన ఫోన్.. చివరికి పౌడర్ లా మారింది. అలా మారిన పిండి మిశ్రమాన్ని సైంటిస్టులు కెమికల్ ల్యాబ్ లో పరీక్షలు జరిపారు. ఈ పరీక్షల్లో ఫోన్ తయారీకి ఎలాంటి, ఎంత మోతాదులో పదార్థాలను వాడారో సైంటిస్టులు తేల్చి చెప్పారు. ఫోన్ తయారీకి వాడిన ఎలిమెంట్స్ లో కన్ఫిక్ట్ ఎలిమెంట్స్ ను ఎక్కువ మోతాదులో వాడినట్టు గుర్తించారు. ఇందులోని పదార్థాలే స్మార్ట్ ఫోన్లను తిరిగి రీసైకిలింగ్ రేట్స్ ను పెంచుతాయనే చెప్పడానికి ఈ ప్రయోగాన్ని చేసినట్టు యూనివర్శిటీ ఆఫ్ పోలిమౌత్ తెలిపింది. ఈ ప్రయోగానికి సంబంధించి వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసింది. ప్రయోగంలో భాగంగా రీసెర్చర్లు.. దాదాపు 500 డిగ్రీల సెల్సియస్ దగ్గర ఫోన్ ను బ్లెండింగ్ చేశారు. ఇందుకు శక్తివంతమైన ఆక్సిడైజర్, సోడియం పెరాక్సైడ్ ను వాడి పరీక్షించారు. ఈ పరీక్షలో బ్లెండింగ్ మిశ్రమంలో విలువైన కెమికల్ కంటెంట్స్ ఉన్నట్టు గుర్తించినట్టు పరిశోధకులు తెలిపారు. 

ప్రయోగంలో ఏం గుర్తించారంటే..
స్మార్ట్ ఫోన్ బ్లెండర్ లో వేసిన తర్వాత అది అంతా బ్లెండింగ్ అయి ఫౌడర్ లా మారింది. ఈ మిశ్రమాన్ని కెమికల్ ద్రావణంలో వేసి పరీక్షించగా.. ఫోన్ తయారీకి ఎలాంటి ఎలిమెంట్స్ వాడారో గుర్తించారు. ఫోన్ తయారీకి వాడిన కెమికల్ ఎలిమెంట్స్ లో.. 33గ్రాముల ఐరన్, 13గ్రాముల సిలికాన్, 7గ్రాము క్రోమియం, 90మిల్లీగ్రాముల సిల్వర్, 36మిల్లీగ్రాముల గోల్డ్ వాడినట్టు సైంటిస్టులు గుర్తించారు. అంతేకాదు.. క్రిటికల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నట్టు తేల్చి చెప్పారు. 90మిల్లీ గ్రాముల టంగస్టన్, 70మిల్లీగ్రాముల కోబాల్ట్, మోలిబెడ్నమ్, 160మిల్లీగ్రాముల నీయోడియమ్, 30గ్రాముల ప్రసియోడియమ్ ఉన్నట్టు గుర్తించారు. 
Read Also: PubG ఫ్యాన్స్ రిలాక్స్: గేమ్ బ్యాన్ చేయడం అంత ఈజీ కాదు!

సైంటిస్టులు చేసిన ఈ ప్రయోగానికి నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.. స్మార్ట్ ఫోన్ ఎలా తయారైందో తెలుసుకోవాలనుకుంటే.. ఫోన్ తయారీ సంస్థలను ఈమెయిల్ చేసిన తెలుసుకోవచ్చు కదా? అని కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి ప్రయోగాలను ఎందరో చేసి యూట్యూబ్ లో ఎప్పుడో పెట్టేశారని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఏది ఏమైనా.. ఫోన్ మేకింగ్ ఎలిమెంట్స్ కనిపెట్టేందుకు సైంటిస్టుల చేసిన ప్రయోగానికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే ఆ వీడియో..