పెద్ద సమస్యే ఇది.. నిమిషానికి 59సెకన్లే.. శాస్త్రవేత్తల ఆలోచన!

పెద్ద సమస్యే ఇది.. నిమిషానికి 59సెకన్లే.. శాస్త్రవేత్తల ఆలోచన!

తన చుట్టూ తాను తిరుగుతూ ఉండే భూమి వేగం పెంచుకుంది. దీంతో సాధారణ సమయం కంటే సమయం వేగంగా గడిచిపోతోంది. భూమికి ప్రళయ సంకేతాలు కనపడుతున్నాయంటూ చాలా ఏళ్లుగా వార్తలు వస్తుండగా.. ఇప్పడు శాస్త్రవేత్తలు సమయాన్ని కుదించే అంశంపై చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే నిమిషాకి 59సెకండ్లనే లెక్కగట్టే యోచనలో ఉన్నారు శాస్త్రవేత్తలు.

మిలియన్ల సంవత్సరాల క్రితం భూమి తన చుట్టూ తాను వేగంగా భ్రమించగా.. ఒకసారి సూర్యుడిని చుట్టి వచ్చే లోపు భూమి తన చుట్టూ ఏకంగా 419 నుంచి 420 సార్లు తిరిగేదట. అయితే అది కాల క్రమంలో ఆ సమయం తగ్గింది. ప్రస్తుతం 365 సార్లు మాత్రమే పరిభ్రమిస్తోంది. ప్రతి ఏడాది దాదాపు 6గంటల సమయం ఎక్కువగా ఉంటోంది. దీంతో నాలుగో ఏడాదిని లీపు ఇయర్‌గా పరిగణించి ఏడాదికి 366 రోజులను నిర్ణయించారు శాస్త్రవేత్తలు. ఇప్పుడు ఆ లెక్క కూడా మారేలా కనిపిస్తోంది.

భూమి వేగవంతమైన వేగాన్ని తగ్గించడానికి శాస్త్రవేత్తలు నిమిషాన్ని 59 సెకన్లకు తగ్గించాలని ఆలోచిస్తున్నారు. భూమి యొక్క నిజమైన భ్రమణానికి సమయాన్ని సమకూర్చడానికి కనీసం ఒక “సెకండ్”ను ఒక నిమిషం నుండి తీసివేయవలసి ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. భూమి వేగం పెరుగుదలలో మార్పులకు అనేక కారణాలు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిలోని సముద్ర మట్టం స్థాయిలో మార్పులు దీనికి ఓ కారణం. చంద్రుడు భూమికి దూరంగా కదులుతుండడం కూడా ఒక కారణమే.

సగటు రోజు సాధారణ 86,400 సెకన్లు ఉంటుంది. అయితే 2021లో 0.05 మిల్లీసెకన్లు తక్కువగా ఉంటున్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ‘అయితే దీనిని అడ్జస్ట్ చేయాలంటే సాధారణ విషయం కాదు. ఇలా ఇంతకుముందు కూడా టైం అడ్జస్ట్ జరిగింది. కానీ అప్పుడు కేవలం 1 మిల్లీ సెకను అడ్జస్ట్ చేశారు. దానివల్లే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వచ్చింది. కంప్యూటర్లు, శాటిలైట్లు అన్నీ క్రాష్ అయ్యాయి. ఇప్పుడు ఏకంగా ఒక సెకెండ్ అడ్జెస్ట్ చెయ్యడం అంటే చాలా కష్టమైన పని.

ఒక్క సెకనును ఒక నిమిషం నుండి తీసివేయడం వలన ఖచ్చితమైన సమయపాలనపై ఆధారపడే ప్రదేశాలలో వినాశనం వస్తుంది. తద్వారా విపత్కర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. 2012లో సమయానికి జోడించిన ఒక లీపు సెకను కారణంగా సర్వర్లు క్రాష్ అయ్యి అనేక సైట్లు పడిపోయాయి. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మరియు జావాస్క్రిప్ట్ కూడా ఫలితంగా అంతరాయాలను చవిచూసింది. కంప్యూటర్లు సమయాన్ని ఒక నిర్దిష్ట పద్ధతిలో ట్రాక్ చేస్తాయి మరియు లీపు సెకను జోడించడం లేదా తీసివేయడం చాలా ప్రమాదం.

అయినప్పటికీ, శాస్త్రవేత్తలు ఒకరకమైన దిద్దుబాటు అవసరం అని చెబుతున్నారు. 59 సెకన్ల నిమిషంను చెయ్యాలని భావిస్తున్నారు. ఏ దిశను తీసుకోవాలో లేదో నిర్ణయించడానికి చాలా సమయం పట్టవచ్చు. అన్ని సంభావ్య సమస్యలను పరిగణనలోకి తీసుకుని, 2023లో జరిగే ప్రపంచ రేడియోకమ్యూనికేషన్ సమావేశం లీపు సెకన్లతో ఎలా ముందుకు వెళ్ళాలో నిర్ణయిస్తుంది.