నవ్వులు పూయిస్తున్న వీడియో : పార్టీ చేసుకుని వేరే ఇంటికి వెళ్లాడు..తర్వాత

  • Published By: madhu ,Published On : January 26, 2020 / 01:46 PM IST
నవ్వులు పూయిస్తున్న వీడియో : పార్టీ చేసుకుని వేరే ఇంటికి వెళ్లాడు..తర్వాత

మనకు తెలియకుండా..ఇతర ఇంట్లో ప్రవేశించి..మంచిగా నిద్రపోతే ఏం చేస్తారు ? ఆ సమయంలో మంచి మందు దంచి కొడితే ? ఆ ఏం చేస్తారు..దొంగ అనుకుని మొదట నాలుగు తన్ని..పోలీసులకు అప్పచెబుతాం..అంటారు కదా. కొంతమంది ఇలా జరుగుతుంటుంది. వారికి ఎదురైన అనుభవాలు కొంతమందికి చెబుతుంటారు. ఇలాగే ఓ ఘటన జరిగింది. కానీ వారు మాత్రం ఆ అపరిచిత వ్యక్తికి ఏకంటీ టీ, సిగరేట్ ఇచ్చి సాగనంపారు.

దీనికి సంబంధించిన ఓ వీడియోను అపరచిత వ్యక్తి తీసి ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన వారు నవ్వుకుంటున్నారు. స్పానిష్‌లో ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. 

పార్టీని ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు ట్యాక్సీని మాట్లాడుకోవడం జరిగిందని జోష్ వెల్లడించాడు. కానీ తనకు తెలియని ఇంట్లోకి ప్రవేశించినట్లు, అప్పటికే మద్యం సేవించినట్లు తెలిపాడు. అనంతరం తాను స్వయంగా నూడుల్స్ చేసుకుని నిద్రపోయినట్లు వెల్లడించాడు. మరుసటి రోజు ఉదయం ఇంట్లో ఉన్న వారు లేపగా తాను ఆశ్చర్యానికి లోనయ్యాయన్నారు.

Read More : బలమైన గోడ : CAAని నిరసిస్తూ..కేరళలో భారీ మానవహారం

మహిళ తనకు టీతో పాటు..సిగరేట్ ఇచ్చారని, థాంక్స్ వెరీ మచ్ అంటూ నవ్వుతూ జోష్ తెలిపారు. గత సంవత్సరం ఏప్రిల్ నెలలోనే ఫేస్ బుక్‌లో ఈ వీడియో చేయగా..తాజాగా ట్విట్టర్ ద్వారా పోస్టు చేశారు. 2020, జనవరి 24వ తేదీన జోస్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. 1.17 నిమిషాలున్న ఈ వీడియోను 1.8 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అలాగే 53.8 వేల లైక్స్, 13 వేల మంది ట్వీట్‌ను రీ ట్వీట్ చేశారు.