Rent Toilet : అద్దెకు టాయిలెట్‌.. ఫ్రిడ్జ్, వైఫై, టీ కెటిల్ తో పాటు అన్ని సౌకర్యాలున్నాయ్

అద్దెకు టాయిలెట్‌..ఫ్రిడ్జ్,వైఫై,టీ కెటిల్ తో పాటు అన్నీ సౌకర్యాలున్నాయ్. ఈ టాయ్ లెట్ ను ఆఫీసు కోసం ఉపయోగించుకోవచ్చు. అద్దె ఎంతంటే..

Rent Toilet : అద్దెకు టాయిలెట్‌.. ఫ్రిడ్జ్, వైఫై, టీ కెటిల్ తో పాటు అన్ని సౌకర్యాలున్నాయ్

Rent Tiny Toilet

Rent tiny Toilet :  ఇల్లు అద్దెకిస్తారు. స్థలాలు అద్దెకిస్తారు.బోటులు, ఫామ్ హౌసులు,వాహనాలు అద్దెకిస్తారనే విషయం తెలిసిందే. కానీ ప్రత్యేకించి ఓ టాయిలెట్‌ అద్దెకు ఇస్తారా? ఎక్కడన్నా విన్నారా? వినిఉండకపోవచ్చు. కానీ ఓ వ్యక్తి తన టాయిలెట్‌ను అద్దెకు ఇస్తానని ప్రకటించాడు. టాయిలెట్‌తో పాటు వైఫై, రిఫ్రిజిరేటర్‌, టీ కెటిల్‌, టేబుల్, ఛైర్ సౌకర్యాలు కూడా ఉన్నాయని ప్రకటించాడు. ఇంతకీ ఇది ఎక్కడా అంటారా?

స్కాట్‌లాండ్ లోని గ్లాస్గోలోని పాట్రిక్‌కు చెందిన ఓ వ్యక్తి గమ్‌ట్రీ అనే ప్రాపర్టీ సైట్‌లో కొద్దిరోజుల క్రితం ఓ ప్రకటన ఇచ్చాడు. తన అపార్ట్‌మెంట్‌ బిల్డింగ్‌లో ఫస్ట్‌ ఫ్లోర్‌లో ఉన్న టాయిలెట్‌ను అద్దెకు ఇస్తున్నానని..దానిలో వైఫై, రిఫ్రిజిరేటర్‌, టీ కెటిల్‌,టేబుల్, ఛైర్ ఇలా కొన్ని రకాల సౌకర్యాలు కూడా ఉన్నాయని ప్రకటనలో వెల్లడించాడు. అలాగే ఆ టాయిలెట్‌ ఆఫీసు నిర్వహించుకోవటానికి బాగుంటుందని పేర్కొన్నాడు. ఆ టాయిలెట్‌ వాడుకోవటానికి వారానికి 50 స్టెర్లింగ్‌ పౌండ్‌లు అంటే భారత కరెన్సీలో 5,070 రూపాయలు అని ప్రకటలో తెలిపాడు.

ఈ టాయిలెట్‌ అద్దెకు తీసుకోవాలనుకునేవారు తనను సంప్రదించవచ్చని..తాను సోమవారం-శుక్రవారం.. ఉదయం 8 గంటలనుంచి సాయంత్రం 6 వరకు అందుబాటులో ఉంటానని తెలిపాడు. దీన్ని ఎక్కువ కాలం అద్దెకు తీసుకునే వాళ్లకు కీస్ కూడా ఇస్తానని తెలిపాడు.ఈ ప్రకటనను చదివిన నెటిజన్లు షాక్ అయ్యారు. ఆ తరువాత అతనిపై ఫైర్ అయ్యారు. టాయిలెట్‌ అద్దెకివ్వటమేంటిరా బాబూ.. దానికి 50 స్టెర్లింగ్‌ పౌండ్‌ల అద్దేంటీ?పైగా దానికి వైఫ్ లతో పాటు ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పటమేంటీ? ఈ చెత్త ఐడియా నీకే వచ్చిందా? లేక ఎవరన్నా చెప్పారా? ఏంటీరా బాబూ ఈ ఐడియాలు అంటూ ఏకేసరికి ఖంగుతిన్న సదరు వ్యక్తి తన ప్రకటను డిలేట్‌ చేసేశాడు.