కరోనా రెండోసారి వచ్చే అవకాశాలు ఎంతంటే

  • Published By: madhu ,Published On : August 31, 2020 / 06:29 AM IST
కరోనా రెండోసారి వచ్చే అవకాశాలు ఎంతంటే

కరోనా రెండోసారి వచ్చే అవకాశాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ఖాతార్ దేశ విభాగం ఓ ప్రకటన వెలువరించింది. కేవలం 0.04 శాతం మాత్రమేనని, ప్రతి 10 వేల మందిలో నలుగురికి వచ్చే అవకాశాలున్నాయని తెలిపింది. పలు దేశాల్లో కరోనా వైరస్ రెండోసారి సోకుతోందని ప్రచారం జరిగింది.



హాంకాంగ్, అమెరికా వంటి దేశాల్లో కేసులు నమోదయ్యాయని, తెలంగాణ రాష్ట్రంలో కూడా రెండు కేసులు నమోదయ్యాయని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. కానీ..ఎక్కడా దీనిపై పూర్తిస్థాయి పరశోధనలు జరగలేదు. WHO ఖతార్ విభాగం, ఆ దేశ ప్రజారోగ్యశాఖ, ఖతార్‌ కార్నెల్‌ యూనివర్సిటీలు దీనిపై సంయుక్తంగా పరిశోధన చేశాయి.
https://10tv.in/a-new-study-suggests-covid-19-reinfection-is-possible-heres-what-to-know/
45 రోజుల తర్వాత మళ్లీ ఆర్‌టీ–పీసీఆర్‌ చేశాక, అందులో 54 మందికి తిరిగి పాజిటివ్‌ వచ్చిందని నిర్ధారణకు వచ్చారు. తిరిగి పాజిటివ్‌ వచ్చిన 54 మందిలో 41 శాతం మందికి కొద్దిపాటి లక్షణాలున్నట్లు కనుగొన్నారు. మరో 58 శాతం మందికి ఏ లక్షణాలు లేవు. ఒకరు మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందారని వెల్లడించింది.



రీ ఇన్ఫెక్ట్‌ అయిన 54 మందిలో సీటీ వ్యాల్యూ 25 కంటే తక్కువ ఉందని గుర్తించారు. 0.04 శాతం మంది రీఇన్ఫెక్ట్‌ కావడం అత్యంత తక్కువని, 10 వేల మందిలో నలుగురికి రావడం అత్యంత అరుదైన విషయమని వెల్లడించింది. ఒకవేళ రెండోసారి సోకిన 54 మందిని పరిశీలించినా వారంతా సురక్షితంగా ఉన్నారని ఈ అధ్యయనం తెలిపింది.



వీరిలో సగం మందికి యాంటీ బాడీస్‌ రాలేదు. మిగిలిన వారికి తీవ్రమైన జబ్బులేమీ లేవు. కాబట్టి రెండోసారి వస్తుంద నేది పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయం కాదని వెల్లడించింది. మొదటిసారి వైరస్‌ వచ్చిపోయాక రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతుందని, అది కనీసం కొన్ని నెలల వరకు ఉంటుందని ఈ కొత్త పరిశోధన పేర్కొంది.