Fire accident: భారీ అగ్ని ప్రమాదం.. 11 మంది నవజాత శిశువులు మృతి

సుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవటంతో పదకొండు మంది నవజాత శిశువులు మరణించారు. ఈ విషాదకర ఘటన ఆఫ్రికన్‌ దేశమైన సెనెగల్‌లో చోటుచేసుకుంది. సెనెగల్​లోని టివయూనే సిటీలో ఉన్న మేమ్ అబ్దు అజీజ్ సై దబాఖ్ ఆసుపత్రిలో షార్ట్​ సర్క్యూట్​ కారణంగా మంటలు చెలరేగాయి.

Fire accident: భారీ అగ్ని ప్రమాదం.. 11 మంది నవజాత శిశువులు మృతి

Fire Accident

Fire accident: ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవటంతో పదకొండు మంది నవజాత శిశువులు మరణించారు. ఈ విషాదకర ఘటన ఆఫ్రికన్‌ దేశమైన సెనెగల్‌లో చోటుచేసుకుంది. సెనెగల్​లోని టివయూనే సిటీలో ఉన్న మేమ్ అబ్దు అజీజ్ సై దబాఖ్ ఆసుపత్రిలో షార్ట్​ సర్క్యూట్​ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో పిల్లల వార్డులో మంటలు చెలరేగి 11 మంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. అక్కడున్న సిబ్బంది అతికష్టం మీద ముగ్గురు చిన్నారుల్ని మాత్రమే కాపాడగలిగారు. ఈ ప్రమాద ఘటన విని దేశ అధ్యక్షుడు మ్యాకీ సాల్ తీవ్ర దిగ్బ్రాంతికి లోనైనట్టు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశంలో మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించారు.

మేమ్ అబ్దుఅజీజ్ సై దబాఖ్ హాస్పిటల్ కొత్తగా ప్రారంభించారు. గత ఏడాది ఏప్రిల్‌లో ఉత్తర పట్టణంలోని లింగ్యూరేలో ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. నలుగురు నవజాత శిశువులు మరణించారు. ప్రసూతి వార్డులోని ఎయిర్ కండిషనింగ్ యూనిట్‌లో విద్యుత్ లోపం ఉందని ఆ పట్టణ మేయర్ పేర్కొన్నారు. తాజాగా టివయూనే సిటీ పరిధి ఆస్పత్రిలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదానికి కారణమైన బాధ్యులను శిక్షించేందుకు స్వతంత్ర విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ అధికారులను ఆ దేశ అధ్యక్షుడు ఆదేశించారు.

Fire Accident: కొంపముంచిన కొవ్వొత్తులు: తెనాలి పరిధిలో మూడు అగ్నిప్రమాదాలు

ఈ ఘటనపై ప్రతిపక్ష రాజకీయ నాయకుడు మమడౌ లామైన్ డియల్లో కూడా ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్కువ మంది పిల్లలు చనిపోవటం ఆమోదయోగ్యం కాదని, అగ్ని ప్రమాదానికి కారణాలపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. నవ జాత శిశువుల మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతిని తెలియజేశారు.