ISIS leader killed : ఐసిస్ సీనియర్ నాయకుడు బిలాల్ అల్ సుదానీని ముట్టుపెట్టిన అమెరికా సైన్యం

సోమాలియాలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థకు ఎదురుదెబ్బ తగిలింది. ఐసీస్ సీనియర్ నాయకుడు బిలాల్ అల్ సుదానీని అమెరికా సైన్యం మట్టుపెట్టింది. ఈ దాడుల్లో సుదానీతో సహా అతని అనుచరులు పది మంది మరణించినట్లు అమెరికా సైనికాధికారులు వెల్లడించారు.

ISIS leader killed : ఐసిస్ సీనియర్ నాయకుడు బిలాల్ అల్ సుదానీని ముట్టుపెట్టిన అమెరికా సైన్యం

ISIS leader killed

ISIS leader killed : సోమాలియాలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థకు ఎదురుదెబ్బ తగిలింది. ఐసీస్ సీనియర్ నాయకుడు బిలాల్ అల్ సుదానీని అమెరికా సైన్యం మట్టుపెట్టింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఉత్తర సోమాలియాలోని పర్వత గుహ కాంప్లెక్సులో ఉన్న ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) గ్రూప్ ప్రాంతీయ నాయకుడైన సుదానీని పట్టుకునేందుకు తొలుత అమెరికా బలగాలు ప్రయత్నించాయి. ఈ క్రమంలో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. అమెరికాసైన్యం ప్రత్యర్థుల దాడినుంచి తప్పించుకునే క్రమంలో సుదానీ ఉండే నివాసాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుదానీతో సహా అతని అనుచరులు పది మంది మరణించినట్లు అమెరికా సైనికాధికారులు వెల్లడించారు.

Taliban U.S made War Chest : తాలిబన్ల చేతుల్లోకి అమెరికా ఆధునాతన ఆయుధాలు!

అల్ సుదానీ సమాచారం అందుకున్న అమెరికా సైన్యం అతన్ని పట్టుకొనేందుకు ప్రణాళికలు రచించాయి. సుదానీ తలదాచుకున్న ప్రాంతంపై ఎలా దాడులు చేయాలనే అంశంపై నెలరోజులు ప్రణాళికలు రచించారు. ఈ క్రమంలో సుదానీ తలదాచుకున్న ప్రదేశాన్ని ప్రతిబింబించేలా నిర్మించిన ప్రదేశంలో యూఎస్ దళాలు రిహార్సల్ సైతం చేశాయి. అధ్యక్షుడు జో బిడెన్ తన జాతీయ భద్రతా బృందంతో చర్చించిన తరువాత ఈ వారం ప్రారంభంలో దాడులు నిర్వహించేందుకు అధికారాలు ఇవ్వటంతో అమెరికా సైన్యం రంగంలోకి దిగింది.

 

ISIS leader Bilal-al-Sudani

ISIS leader Bilal-al-Sudani

ఆఫ్రికాలో ఐసీస్ ఉనికిని పెంపొందించడానికి, ఆఫ్ఘనిస్తాన్‌తో సహా ప్రపంచ వ్యాప్తంగా గ్రూప్ కార్యకలాపాలకు నిధులు సమకూర్చడానికి అల్ సుదానీ కీలక భూమిక పోషించారని అమెరికా సైన్యాధికారులు తెలిపారు. సొమాలియాలో తీవ్రవాద అల్-షబాబ్ ఉద్యమంకోసం యోధులను నియమించి వారికి శిక్షణ ఇచ్చాడని యూఎస్ అధికారులు చెప్పారు. ఇదిలాఉంటే.. ఈ ఆపరేషన్ లో సామాన్య పౌరులకు, సైనికులకు ఎలాంటి గాయాలు కాలేదని యూఎస్ సైన్యం తెలిపింది. అమెరికా రక్షణ విభాగమైన పెంటగాన్ విజ్ఞప్తి మేరకు సోమాలియా మిలిటరీకి యూఎస్ సహాయం అందిస్తున్న విషయం విధితమే. 2022 మే నుంచి దాదాపు 500 ట్రూపులను సోమాలియాలో మోహరించింది. ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు సోమాలియా సైనికులకు తగిన శిక్షణ అందించడంతోపాటు వారికి సపోర్ట్‌గా టెర్రరిస్టు కేంద్రాలపై దాడులు నిర్వహిస్తుంది