ఎక్స్‌పైర్ డేట్ చూడక్కర్లా : పాడైన పాలను గుర్తించే సెన్సార్

  • Published By: veegamteam ,Published On : May 8, 2019 / 04:52 AM IST
ఎక్స్‌పైర్ డేట్ చూడక్కర్లా : పాడైన పాలను గుర్తించే సెన్సార్

వాషింగ్టన్‌: పాలు నిల్వ ఉంటే పాడైపోవటం సర్వసాధారణం.కానీ పాలు పాడైపోయాయో..ఫ్రెష్ గా ఉన్నాయా లేదా అని కనిపెట్టటం తెలియకపోవచ్చు.కానీ పాడైన పాలను కనిపెట్టటం ఈజీ అంటున్నారు సైంటిస్టులు. 

పాలు పాడైపోయిన విషయాన్ని పసిగట్టే సెన్సార్‌ను వాషింగ్టన్‌ స్టేట్‌ యూనివర్సిటీ సైంటిస్టులు తయారుచేశారు. పాల ప్యాకెట్లమీద ఎక్స్‌పైరీ డేట్లు చూసుకోవటం పాత పద్దతి..తాజాగా  సైంటిస్టులు  తయారు చేసిన ఈ సరికొత్త సెన్సార్ పాలలో బ్యాక్టీరియా పెరిగితే పాలలోంచి వచ్చే వాయువులను ఈ సెన్సర్లపై కెమికల్ లేయర్ పై ఉండే సూక్ష్మ అణువులు పసిగడతాయని   వాషింగ్టన్‌ స్టేట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ శ్యామ్‌ సబ్లానీ తెలిపారు. ఈ సెన్సర్‌ పాలను డైరెక్ట్ గా టచ్ చేయకుండానే అవి ఫ్రెష్ మిల్కా.. లేదా పాడైన మిల్కా అనేది చెప్పేస్తుంది. 

కాగా బాక్స్ లో పెట్టిన ఫుడ్ ఐటెమ్స్ ఏవైనా పాడైతే..దాంట్లో బ్యాక్టీరియా పెరిగటం వల్లే అది పాడై..చెడు వాసన వస్తుంది. ఆ విషయం మనకు తెలియాలంటే ఆ బాక్స్ ఓపెన్ చేస్తేనే గానీ మనకు తెలియదు. కానీ ఈ సెన్సర్‌ మారిన ఫుడ్ కలర్ ను..దాని నుంచి వెలువడే వాయువులను గుర్తించి ఆ ఫుడ్ ఏ స్థితిలో ఉందో కూడా చెప్పేయడం ఈ సెన్సార్ ప్రత్యేకత అంటున్నారు సైంటిస్టులు.