Kim’s Daughter: కిమ్ కూతురి ఫొటో గురించి చర్చ.. ఆయన రెండో కుమార్తె అని తెలిపిన దక్షిణకొరియా

ఇటీవల వైట్ కోటు, రెడ్ షూలతో కనపడిన అమ్మాయి.. కిమ్ జోంగ్ ఉన్ రెండో కుమార్తె అని, ఆమెకు 10 ఏళ్ల వయసు ఉంటుందని దక్షిణ కొరియా జాతీయ నిఘా సంస్థ చెప్పింది. ఆ సమయంలో కిమ్ తో పాటు ఆయన భార్య రి సోల్ యూ కూడా కనపడ్డారు. నిజానికి కిమ్ తీసుకొచ్చిన ఆయన కూతురి పేరు జు ఈ అని దక్షిణ కొరియా జాతీయ నిఘా సంస్థ ప్రతినిధి యూ సాంగ్ బుమ్ చెప్పారు.

Kim’s Daughter: కిమ్ కూతురి ఫొటో గురించి చర్చ.. ఆయన రెండో కుమార్తె అని తెలిపిన దక్షిణకొరియా

Kim's Daughter

Kim’s Daughter: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఇటీవల తన కూతురితో కలిసి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని చూడడానికి వెళ్లడం చర్చనీయాంశమైంది. ఆయన కూతురి పేరు కిమ్ చు-ఏ అని పలు వార్తా పత్రికలు ప్రచురించాయి. కిమ్ తన కూతురిని ఏ ఉద్దేశంతో అక్కడకు తీసుకెళ్లారు? కిమ్ కు ఎంతమంది పిల్లలు? తాజాగా ఆయన ప్రపంచానికి చూపించిన అమ్మాయి కిమ్ కి ఎన్నో కూతురు? వంటి ప్రశ్నలు వస్తున్నాయి. దీనిపై దక్షిణ కొరియా జాతీయ నిఘా సంస్థ పలు వివరాలు తెలిపింది.

ఇటీవల వైట్ కోటు, రెడ్ షూలతో కనపడిన అమ్మాయి.. కిమ్ జోంగ్ ఉన్ రెండో కుమార్తె అని, ఆమెకు 10 ఏళ్ల వయసు ఉంటుందని దక్షిణ కొరియా జాతీయ నిఘా సంస్థ చెప్పింది. ఆ సమయంలో కిమ్ తో పాటు ఆయన భార్య రి సోల్ యూ కూడా కనపడ్డారు. నిజానికి కిమ్ తీసుకొచ్చిన ఆయన కూతురి పేరు జు ఈ అని దక్షిణ కొరియా జాతీయ నిఘా సంస్థ ప్రతినిధి యూ సాంగ్ బుమ్ చెప్పారు.

కిమ్ కూతుళ్ల గురించి తమ వద్ద ఉన్న సమాచారంతో పోల్చి ఇటీవల కనపడిన జు ఈ ని చూస్తే ఈ విషయాలు స్పష్టమవుతున్నాయని తెలిపారు. కిమ్ కి మరో ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, వారి వయసు కూడా 10 ఏళ్లే ఉంటుందని అన్నారు. ఆ ముగ్గురిలో రెండో అమ్మాయిని కిమ్ ప్రపంచానికి చూపించాడని చెప్పారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..