Sello Abram Maponya : సీరియల్ రేపిస్ట్ కు 1088 ఏళ్ల జైలు శిక్ష

రేప్ మరియు దొంగతం కేసులో దక్షిణాఫ్రికాకు చెందిన నార్త్ గౌటెంగ్ హైకోర్టు గురువారం సంచలన తీర్పు వెలువ‌రించింది.

Sello Abram Maponya : సీరియల్ రేపిస్ట్ కు 1088 ఏళ్ల జైలు శిక్ష

Serial Rapist Sello Maponya Handed 1088 Years In Jail

Sello Abram Maponya రేప్ మరియు దొంగతం కేసులో దక్షిణాఫ్రికాకు చెందిన నార్త్ గౌటెంగ్ హైకోర్టు గురువారం సంచలన తీర్పు వెలువ‌రించింది. నేరం తీవ్ర‌త‌ను బ‌ట్టి దోషికి ఏకంగా 1088 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

2014-19 మధ్యకాలంలో సెల్లో అబ్రమ్ మాపున్యా (33) అనే వ్యక్తి…అటెరిడ్జ్‌విల్లే, మామెలోడి, ఒలివెన్‌హౌట్‌బోష్ మరియు సిల్వర్టన్ ప్రాంతాల్లోనిఇళ్లల్లో చొరబడి దొంగతనాలు చేసేవాడు. దొంగ‌త‌నాల‌తోపాటు మహిళలపై అత్యాచారాల‌కు కూడా పాల్ప‌డేవాడు. ప‌లువురు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల‌ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు 2019 మార్చిలో సెల్లో అబ్రమ్ మాపున్యాను అదుపులోకి తీసుకున్నారు. ఆ త‌ర్వాత నిందితుడిని కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసుకు సంబంధించి సమ‌గ్ర‌ విచారణ జరిపిన కోర్టు.. తాజాగా సెల్లో అబ్రమ్ మాపున్యాను దోషిగా తేల్చింది. సెల్లో అబ్రమ్ మొత్తం 40 ఇండ్ల‌లో చోరీలకు పాల్ప‌డ‌టంతోపాటు 41 మంది మహిళలపై అత్యాచారం చేసినట్టు ధ్రువీకరించింది. ఈ క్రమంలోనే న్యాయ‌స్థానం సెల్లో అబ్రమ్ మాపున్యాకు 1,088 ఏండ్ల‌ జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెలువరించింది.అదేవిధంగా, లైంగిక నేరస్థుల జాతీయ రిజిస్టర్‌లో మాపున్యా పేరును చేర్చాలని జడ్జి మోసోపా అధికారులను ఆదేశించారు.

అయితే,దోషులకు కోర్టులు ఇన్ని వందల సంవత్సరాలు జైలు శిక్ష విధించిడం ఇదే మొదటిసారి కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇలా కోర్టులు వందల ఏళ్లు దోషులకు జైలు శిక్షలు విధించిన సందర్భాలున్నాయి. ఈ ఏడాది జనవరిలో టర్కీ కోర్టు..మైనర్లపై లైంగిక దాడులు, ఆర్మీ గూఢచర్యం, బ్లాక్‌మెయిలింగ్ వంటి కేసుల్లో దోషిగా తేలిన వివాదాస్పద ముస్లిం మత బోధకుడు అద్నన్ ఒక్తర్‌ కు 1075 సంవత్సరాల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.