ఘోర విషాదం : కుప్పకూలిన స్కూల్..ఏడుగురు విద్యార్ధులు మృతి

  • Published By: veegamteam ,Published On : September 24, 2019 / 05:35 AM IST
ఘోర విషాదం : కుప్పకూలిన స్కూల్..ఏడుగురు విద్యార్ధులు మృతి

ఆడుతూ..పాడుతూ..స్కూల్ కు వెళ్లిన చిన్నారులు విగతజీవులుగా మారిపోయారు. సోమవారం (సెప్టెంబర్ 23) ఉదయం న  కెన్యా రాజధాని నైరోబీలో  ప్రీసియస్ టాలెంట్ ప్రైమరీ స్కూల్  పైకప్పు కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో 64 మందికి విద్యార్దులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన విద్యార్థులను వెంటనే నైరోబీలోని  నెన్యాట్టా నేషనల్ ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నట్లు నైరోబీ విద్యాశాఖ కార్యదర్శి జార్జ్ మగోహా తెలిపారు.

ప్రమాద సమయంలో స్కూల్లో 800ల మంది విద్యార్ధులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. శిథిలాల్లో చిక్కుకున్న చిన్నారులను సహాయక సిబ్బంది వెలికితీస్తున్నారు. మృతులు తల్లిదండ్రుల ఏడ్పులతో..గాయపడిన చిన్నారుల ఆర్తనాదాలతో  ఆ ప్రాంతమంతా తీవ్ర విషాదం నిండుకుంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. 
ఈ ప్రమాదంపై స్కూల్ మేనేజర్ మోసెస్ వైనా మాట్లాడుతూ..స్కూల్ వెనుక భాగంలో మురుగునీటి డ్రైనేజ్ ఉందనీ..దీంతో స్కూల్ భవనం వీక్ అయి కూలిపోయి ఉంటుందని అనుమానం వ్యక్తంచేశారు.  స్కూల్ నిర్మాణం ఎక్కువగా కలపతో నిర్మించి ఉండటంతో  నిర్మాణ లోపం వల్లనే స్కూల్ కూలిపోయిందని  అధికారులు నిర్దారణకు వచ్చారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు జార్జ్ చెప్పారు. ఘటనా సహాయక చర్యల్లో రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొని సహాయక చర్యల్ని కొనసాగుతున్నాయి.