Seven Planets: సినిమా సీన్ రిపీట్.. 18సంవత్సరాల తర్వాత ఏడు గ్రహాలు ఒకే తాటిపైకి

ఒకే వరుసలో ఏడు గ్రహాలు రాబోతున్నాయి. జూన్ 24 శుక్రవారం ఈ అద్భుతం జరగబోతుంది. మెర్క్యురీ, వీనస్, మార్స్, బృహస్పతి, శని, నెప్ట్యూన్, యురేనస్ అనే ఏడు గ్రహాలు జూన్ 24 నుంచి స్కేల్‌పై ఉంచినట్లుగా ఒకే లైన్‌లోకి రానున్నాయట.

Seven Planets: సినిమా సీన్ రిపీట్.. 18సంవత్సరాల తర్వాత ఏడు గ్రహాలు ఒకే తాటిపైకి

Seven Planets

Seven Planets: ఒకే వరుసలో ఏడు గ్రహాలు రాబోతున్నాయి. జూన్ 24 శుక్రవారం ఈ అద్భుతం జరగబోతుంది. మెర్క్యురీ, వీనస్, మార్స్, బృహస్పతి, శని, నెప్ట్యూన్, యురేనస్ అనే ఏడు గ్రహాలు జూన్ 24 నుంచి స్కేల్‌పై ఉంచినట్లుగా ఒకే లైన్‌లోకి రానున్నాయట. ఈ అరుదైన సంఘటన, 18 సంవత్సరాల తర్వాత జరుగుతోంది.

అరుదైన ఈ అమరికలో మొత్తం ఏడు గ్రహాలు ఉంటాయి. వీటిని వీక్షించేందుకు సరైన సమయం జూన్ 24, 27 మధ్య సూర్యోదయానికి అరగంట ముందు. మెర్క్యురీ, వీనస్, మార్స్, బృహస్పతి, శని ఐదు ప్రధాన గ్రహాలు – కంటికి కనిపిస్తాయి. కాబట్టి ఐదు గ్రహాలు మాత్రమే ఒక్క వరుసలోకి వచ్చినట్లు అనిపించవచ్చు.

ఆకాశం అంతటా, తూర్పు నుండి దక్షిణం వరకు విస్తరించి ఉన్నట్లుగా కనిపిస్తాయి. నిజానికి దక్షిణ అక్షాంశంలో ఉత్తరం నుండి తూర్పు వరకు విస్తరించి ఉంటాయి.

Read Also: వెయ్యేళ్ల తరువాత ఆకాశంలో అద్భుతం.. ఒకే వరుసలోకి నాలుగు గ్రహాలు

యురేనస్, నెప్ట్యూన్ నేరుగా చూసేటప్పుడు కనిపించకపోవచ్చు. కానీ జూన్ 27 నాటికి బైనాక్యులర్స్ లేదా టెలిస్కోప్ వంటి సహాయాల సహాయంతో ఈ గ్రహాలను వీక్షించగలం.

ఖగోళ శాస్త్రవేత్త కెవిన్ వాల్ష్ ఈ అరుదైన అమరికను ఎలా వీక్షించగలమో చెప్తున్నారు. “జూన్ 24న సూర్యోదయానికి 45 నిమిషాల ముందు తూర్పు వైపు చూస్తే ఈ దృగ్విషయాన్ని చూడగలుగుతాం” అని అతను చెప్పాడు.

ఈ గ్రహాలు డిసెంబర్ 2004 నుండి ఒకే వరుసలోకి రాలేదు. ఈ అరుదైన సంఘటన మరోసారి అంటే సెప్టెంబరు 2040లో కనిపిస్తుంది.