Mexico: తనపై అత్యాచారానికి పాల్పడుతోన్న వేళ మృగాడిని చంపిన అమ్మాయి.. ఆమెకు ఆరేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు.. చివరకు..

అంతేగాక, మృతుడి కుటుంబానికి దాదాపు రూ.13 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు చెప్పింది.

Mexico: తనపై అత్యాచారానికి పాల్పడుతోన్న వేళ మృగాడిని చంపిన అమ్మాయి.. ఆమెకు ఆరేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు.. చివరకు..

Mexico

Mexico Court: అత్యాచారం చేస్తోన్న ఓ మృగాడిని చంపింది ఓ యువతి. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆమెకు ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, కోర్టు తీర్పుపై స్త్రీవాద సంఘాలు (feminist groups), పలువురు నిపుణులు, బాధిత యువతికి చెందిన న్యాయవాదులు మండిపడుతున్నారు.

ఈ తీర్పు వివక్షాపూరితంగా ఉందని చెబుతున్నారు. ఈ తీర్పుపై అప్పీలు చేస్తామని అంటున్నారు. మెక్సికోకు చెందిన ఓ యువతిపై 2021లో ఓ మృగాడు దాడి చేసి, అత్యాచారం చేశాడు. అదే సమయంలో అతడిని బాధిత యువతి చంపేసింది. ఈ కేసులో కోర్టు విచారణ జరిపి తాజాగా తీర్పు చెప్పింది. ఆ యువతి ఆరేళ్ల జైలు శిక్ష అనుభవించాలని కోర్టు పేర్కొంది.

బాధిత యువతికి 23 ఏళ్లు ఉంటాయి. ఆమెపై అత్యాచారం జరిగిందని కోర్టు తేల్చింది. అయితే, ఆ సమయంలో మృగాడి చర్యను ప్రతిఘించడానికి అతడిపై తీవ్రంగా దాడి చేసిందని కోర్టు చెప్పింది. తీవ్రంగా దాడి చేసి, చంపడం చట్టానికి వ్యతిరేకమని పేర్కొంది. మృగాడి బారి నుంచి రక్షించుకోవడానికి అతడి తలపై కొడితే సరిపోయేదని కోర్టు పేర్కొనడం గమనార్హం.

అంతేగాక, మృతుడి కుటుంబానికి దాదాపు రూ.13 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు చెప్పింది. బాధితురాలి తరఫు న్యాయవాది తాజాగా మీడియాతో మాట్లాడుతూ… అత్యాచారానికి గురైనప్పటికీ బాధితురాలు ప్రతిఘటించే హక్కు కూడా లేదా? అని అన్నారు. బాధిత యువతికి మద్దతుగా స్త్రీవాద సంఘాలు నిరసన ప్రదర్శనలు చేపట్టాయి.

Rohini : పది గంటలు సర్జరీ.. నటి రోహిణి కాలులోంచి రాడ్ బయటకు తీసిన డాక్టర్లు.. రెండు నెలలు బెడ్ రెస్ట్..