Gabba Stadium : ఓ వైపు మ్యాచ్..మరోవైపు ప్రపోజల్, ముద్దులు, కౌగిలింతలు

బ్రిస్బేన్ లోని గబ్బాలో యాషెస్ ప్రతిష్టాత్మక సిరీస్ జరుగుతోంది. ఆస్ట్రేలియా - ఇంగ్లండ్ జట్ల మధ్య తొలిటెస్టు మ్యాచ్ జరుగుతోంది....

Gabba Stadium : ఓ వైపు మ్యాచ్..మరోవైపు ప్రపోజల్, ముద్దులు, కౌగిలింతలు

Cricket

Ashes Fan Proposes To Girlfriend : ఈ మధ్యకాలంలో…వెరైటీగా ప్రపోజల్స్ చేస్తున్నారు. ప్రేమను వ్యక్తపరిచే అపురూప క్షణాలను కలకాలం పదిలం చేసేందుకు వినూత్నంగా గర్ల్ ఫ్రెండ్స్ కు తన ప్రేమను వ్యక్తపరుస్తున్నారు. దీంతో వారు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా..ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఓ వైపు మ్యాచ్ జరుగుతుండగా…గర్ల్ ఫ్రెండ్ కు ప్రపోజ్ చేశాడు. అక్కడున్న స్కీన్ పై అతని ప్రపోజల్ ప్రత్యక్షం కావడం…ప్రియురాలు ఒకే అనడంతో అక్కడున్న వారు చప్పట్లు కొట్టారు. ఈ ఘటన గబ్బా వేదికపై చోటు చేసుకుంది.

Read More : New Secretariat : కొత్త సెక్రటేరియట్‌ను పరిశీలించిన సీఎం కేసీఆర్ – Exclusive Photos

బ్రిస్బేన్ లోని గబ్బాలో యాషెస్ ప్రతిష్టాత్మక సిరీస్ జరుగుతోంది. ఆస్ట్రేలియా – ఇంగ్లండ్ జట్ల మధ్య తొలిటెస్టు మ్యాచ్ జరుగుతోంది. మూడో రోజు ఆటలో భాగంగా..క్రీడాభిమానులు మ్యాచ్ ను తిలకిస్తున్నారు. రాబ్ అనే వ్యక్తి ఒక్కసారిగా లేచి…ప్రేయసి నాట్ ముందు మోకాళ్లపై కూర్చొన్నాడు. ఉంగరం తీసి తన ప్రేమను వ్యక్తపరిచాడు. తొలుత నాట్ ఆశ్చర్యానికి లోనైంది. ముసిముసి నవ్వులు నవ్వుతూ..ఒకే చెప్పేసింది. రాబ్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకుని ముద్దుల్లో ముంచెత్తింది. అక్కడున్న వారు తమ సెల్ ఫోన్ లలో ఆ దృశ్యాన్ని బంధించారు. తన ప్రేమను వ్యక్తపరిచాడు. 7Cricket ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది. క్షణాల్లో ఈ వీడియో వైరల్ అయ్యింది.