UAE President: యూఏఈ కొత్త అధ్యక్షుడిగా మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యన్

సుదీర్ఘ కాలంగా పాలించిన షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. దాని ప్రెసిడెంట్ మరుసటి రోజే కొత్త అధ్యక్షుడి ఎన్నిక పూర్తయింది. ఫెడరల్ సుప్రీం కౌన్సిల్ ద్వారా షేక్ మొహమ్మద్ ఎన్నుకున్నట్లు సమాచారం.

UAE President: యూఏఈ కొత్త అధ్యక్షుడిగా మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యన్

Uae President

UAE President: UAEని సుదీర్ఘ కాలంగా పాలించిన షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. దాని ప్రెసిడెంట్ మరుసటి రోజే కొత్త అధ్యక్షుడి ఎన్నిక పూర్తయింది. ఫెడరల్ సుప్రీం కౌన్సిల్ ద్వారా షేక్ మొహమ్మద్ ఎన్నుకున్నట్లు సమాచారం.

అతని సవతి సోదరుడైనటువంటి ప్రెసిడెంట్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆరోగ్యం మందగించి చాలా సంవత్సరాల తర్వాత తుది శ్వాస విడిచారు. ఖలీఫా శుక్రవారం మరణించిన తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన ఆరుగురు షేక్ లు మీటింగ్ నిర్వహించి తర్వాత నహ్యాన్ ను ఎన్నుకున్నారు.

“అతనికి అభినందనలు తెలియజేస్తున్నాం. విధేయతతో ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం, భగవంతుడి సంకల్సం వల్లనే దేశం మొత్తం కీర్తి, గౌరవం దక్కేందుకు అతను ఎంపికయ్యాడు.” అని దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఓటు తర్వాత ట్విట్టర్‌లో తెలిపారు.

Read Also : ఇకనుంచి యాక్సిడెంట్‌ ఫొటోలు,వీడియోలు తీస్తే జైలుకే..ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ ఖలిఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరణించినట్లు యూఏఈ అధికారిక మీడియా వెల్లడించింది. 1948లో జన్మించిన షేక్ ఖలిఫా, 2004లో యూఏఈ అధ్యక్షుడయ్యాడు. ఆయన యూఏఈలోనే అత్యంత ధనవంతుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. షేక్ ఖలిఫా అబు దాబి ఎమిరేట్ పాలకుడు కూడా.

షేక్ ఖలీఫా పాలనలో యూఏఈ వేగంగా అభివృద్ధి చెందడంలో కీలక పాత్ర పోషించారు. అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత పౌరుల శ్రేయస్సు, స్థిరమైన అభివృద్ధిని సాధించేందుకు మొదటి వ్యూహాత్మక ప్రణాళికను ప్రారంభించారు.

నార్తర్న్ ఎమిరేట్స్ అవసరాలను అధ్యయనం చేయడానికి యూఏఈ అంతటా విస్తృతంగా పర్యటించడంతో పాటు గృహ నిర్మాణం, విద్య, సామాజిక సేవలకు సంబంధించి అనేక ప్రాజెక్టులకు పలు సూచనలు చేశారు. ఫెడరల్‌ నేషన్‌ కౌన్సిల్‌ సభ్యుల కోసం నామినేషన్‌ విధానాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేశారు.