ఇమ్రాన్ ఇదిగో ఆధారం : ఇప్పటికైనా ఉగ్రవాదులపై చర్యలు తీసుకుంటారా

పుల్వామా ఉగ్రదాడి తమ పని కాదని కథలు చెప్పారు. ఆధారాలు ఉంటే చూపించాలని భారత్‌ను డిమాండ్ చేశారు. పాకిస్తాన్ లో ఉగ్రవాదానికి చోటే లేదని పచ్చి అబద్దాలు చెప్పిన పాక్

  • Published By: veegamteam ,Published On : February 20, 2019 / 04:13 AM IST
ఇమ్రాన్ ఇదిగో ఆధారం : ఇప్పటికైనా ఉగ్రవాదులపై చర్యలు తీసుకుంటారా

పుల్వామా ఉగ్రదాడి తమ పని కాదని కథలు చెప్పారు. ఆధారాలు ఉంటే చూపించాలని భారత్‌ను డిమాండ్ చేశారు. పాకిస్తాన్ లో ఉగ్రవాదానికి చోటే లేదని పచ్చి అబద్దాలు చెప్పిన పాక్

పుల్వామా ఉగ్రదాడి తమ పని కాదని కథలు చెప్పారు. ఆధారాలు ఉంటే చూపించాలని భారత్‌ను డిమాండ్ చేశారు. పాకిస్తాన్ లో ఉగ్రవాదానికి చోటే లేదని పచ్చి అబద్దాలు చెప్పిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌‌కు ఆ దేశ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ గట్టి షాక్ ఇచ్చింది. పుల్వామా దాడి తమ పనే అంటూ జైషే ఉగ్రవాద సంస్థ మరో వీడియోను విడుదల చేసింది. తాము ఎప్పుడు కావాలంటే అప్పుడు పుల్వామా లాంటి దాడులను చేయగలమని అందులో చెప్పింది. ఇప్పుడీ వీడియో పాక్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. టెర్రరిస్టులతో తమకు సంబంధం లేదని కబుర్లు చెబుతున్న పాక్ ప్రధాని ఈ వీడియోకు ఏం సమాధానం చెబుతారో చూడాలి. 

 
జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్ కేంద్రంగా నడుస్తోంది. జైషే చీఫ్ మసూద్ అజర్ పాక్ లో ఆశ్రయం పొందుతున్నాడు. పాక్ ప్రభుత్వం, ఆర్మీ నుంచి మసూద్ కు పుష్కలంగా అండదండలు ఉన్నాయి. పుల్వామా ఆత్మాహుతి దాడి పాక్ పనేనని మొదట్నుంచి ఆరోపిస్తున్న భారత్‌కు ఈ వీడియో రూపంలో ఇప్పుడు మరో ఆయుధం దొరికినట్టు అయింది. ఈ వీడియో సాయంతో అంతర్జాతీయ సమాజంలో పాక్ ను దోషిగా నిలబెట్టేందుకు, ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేలా పాక్ ప్రధానిపై ఒత్తిడి తెచ్చేందుకు భారత్ ప్రయత్నాలు చేయనుంది.

 

ఫిబ్రవరి 14వ తేదీన జమ్ము నుంచి శ్రీనగర్‌ వెళ్తున్న సీఆర్పీఎఫ్‌ బలగాల కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. దాడి తమపనే అంటూ కాసేపటికే జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ వీడియోను విడుదల చేసింది. ఇప్పుడు రెండో వీడియోను విడుదల చేసింది. ఆత్మాహుతి దాడికి కశ్మీర్ కు చెందిన యువకుడినే ఉగ్రవాదుల ఎంచుకున్నారు. అతడిలో భారత్ పై విద్వేషం నూరిపోసి సూసైడ్ బాంబర్ గా తయారు చేశారు.