Vladimir Putin : బంగారు టాయిలెట్‌లో స్నానం.. రూ.3000 కోట్ల ఖరీదైన విమానంలో ప్రయాణం చేసే నాయకుడు ఎవరంటే…

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి మహారాజులా జీవించడం ఇష్టంట. 2012 నాటి ఓ నివేదిక ఆయన ఆస్తుల వివరాలు బయటపెట్టింది. ఆ వివరాలు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఇక తాజా నివేదికలు బయటకు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో? ఆయన ప్లాలెస్, వాడే వస్తువుల ఖరీదు అన్నింటి వివరాలు తెలిస్తే మీరు కూడా షాకవుతారు.

Vladimir Putin : బంగారు టాయిలెట్‌లో స్నానం.. రూ.3000 కోట్ల ఖరీదైన విమానంలో ప్రయాణం చేసే నాయకుడు ఎవరంటే…

Vladimir Putin

Vladimir Putin : అతని ఇల్లు రూ.78 బిలియన్లు చేస్తుంది. రూ 1.5 కోట్ల విలువైన వాచ్ పెట్టుకుంటాడు. బంగారపు టాయిలెట్‌లో స్నానం చేస్తాడు. 42 జెట్ విమానాలు ఉన్నాయి. సౌదీ రాజు గురించో బ్రూనై సుల్తాన్ గురించో చెప్పట్లేదు.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురించి. 2012 లో ఓ నివేదిక ప్రకారం అతని ఆస్తుల వివరాలు ఇవి.. మరి ఇప్పుడు ఇంకెన్ని ఆస్తులు ఉండి ఉంటాయో ఊహించండి.

Russia Sell Zelensky House : యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భార్య కోసం కొన్నఇంటిని అమ్మేస్తున్న పుతిన్ .. ధర ఎంతో తెలుసా..?

పుతిన్‌కి మహారాజుల జీవించడం అంటే ఇష్టంట.. ఈయనకు సంబంధించిన వార్త ఒకటి నెట్‌లో హల్చల్ చేస్తోంది. ఒక పాత నివేదిక ప్రకారం పుతిన్ వద్ద 20 విలాసవంతమైన ఇళ్లు, 43 విమానాలు, 15 హెలీకాప్టర్లు, 700 కార్లు, వాచ్‌లు ఉన్నాయట. ఆయన ఇంటికి ‘పుతిన్ ప్యాలెస్’ అని పేరు పెట్టుకున్నారట. ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.78 బిలియన్లు.

 

ఆయన ఇంటి నుంచి చూస్తే రష్యా నల్ల సముద్రం కనిపిస్తుందట. దీని చుట్టూ 74 హెక్టార్లు (180 ఎకరాలు) స్థలాన్ని నో-ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటించేశారట. ఈ స్థలంలోనే పుతిన్ 17,700 స్క్వేర్ మీటర్ (191,000 స్క్వేర్ ఫీట్) ప్యాలెస్ ఉందట. ప్యాలెస్ లో గ్రీన్ హౌస్, చర్చి, ఛాంబర్‌తో పాటు 80 మీటర్లు (260 అడుగులు) సొరంగం ఉన్నాయట.

Russia: పుతిన్‭ను విమర్శిస్తూ పాట పాడిన సింగర్ అనుమానాస్పద స్థితిలో మృతి

ఇక పుతిన్ ప్యాలెస్‌లో స్విమ్మింగ్ పూల్, స్పా, మ్యూజిక్ రూం, థియేటర్‌తో పాటు పెద్ద గెస్ట్ బెడ్ రూంలు ఉన్నాయట. ఇందులో రూ.4 కోట్ల విలువైన సోఫాలు కూడా ఉన్నాయట. ఇక ఆ ఇంట్లోని బార్ టేబుల్ ఖరీదే రూ.44 లక్షలట. పుతిన్ దగ్గర 42 జెట్ విమానాలు ఉన్నా.. తన ప్రత్యేక నియో క్లాసికల్ స్టైల్ విమానంలో మాత్రమే పుతిన్ ప్రయాణిస్తారట. ఈ విమానం ఖరీదు రూ.3000 కోట్లు. ఆ విమానంలోనే బంగారు టాయిలెట్ ఉన్నట్లు ది గార్డియన్‌లోని ఒక నివేదిక పేర్కొంది.  2012 నాటి నివేదిక ఇచ్చిన పుతిన్ ఆస్తుల వివరాలు ఇవి. ఇక ఇప్పటి ఆస్తుల వివరాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ఓసారి ఊహించుకోవచ్చు.