Covid Vaccine Lottery : కొవిడ్ టీకా లాటరీ.. వ్యాక్సిన్ వేయించుకోండి.. కోటీశ్వరుడయ్యే లక్కీ ఛాన్స్..

కరోనా టీకా వేయించుకోండి.. కోటీశ్వరుడయ్యే లక్కీ ఛాన్స్.. ఒక మిలియన్ డాలర్లు (రూ.7.3 కోట్లు) లాటరీ గెల్చుకోండి అంటూ యువకులకు అమెరికా ఆఫర్ ఇచ్చింది. వ్యాక్సిన్ వేయించుకోవాలంటే చాలామంది ముందుకు రావడం లేదు.

Covid Vaccine Lottery : కొవిడ్ టీకా లాటరీ.. వ్యాక్సిన్ వేయించుకోండి.. కోటీశ్వరుడయ్యే లక్కీ ఛాన్స్..

Shoot Your Shot Us State Offers $1 Million Covid Vaccine Lottery (1)

US State Offers Covid Vaccine Lottery :  కరోనా టీకా వేయించుకోండి.. కోటీశ్వరుడయ్యే లక్కీ ఛాన్స్.. ఒక మిలియన్ డాలర్లు (రూ.7.3 కోట్లు) లాటరీ గెల్చుకోండి అంటూ యువకులకు అమెరికా ఆఫర్ ఇచ్చింది. కరోనావైరస్ కట్టడి చేసేందుకు అందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలంటే చాలామంది ముందుకు రావడం లేదు. ముఖ్యంగా యువకులు వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. అందుకే 18 ఏళ్లు నిండిన యువకుల్లో వ్యాక్సినేషన్ పై అవగాహన కల్పించేందుకు అమెరికాలో కొవిడ్ వ్యాక్సిన్ లాటరీ ఆఫర్ ప్రకటించింది. ఒహైయో గవర్నర్‌ మైక్‌ డివైన్‌ రాష్ట్ర ప్రజలకు బంపర్‌ ఆఫర్ ప్రకటించారు. టీకా వేయించుకున్నవారిలో కోటిశ్వరుడు అయ్యే అదృష్టవంతులెవరో పరీక్షించుకోండి అంటూ పిలుపునిచ్చారు.

ప్రతి వారం ఒక మిలియన్‌ డాలర్లు(రూ.7.3కోట్లు) ప్రైజ్ ఇస్తామని ఆయన ట్వీట్‌ చేశారు. 18 నిండి కనీసం ఒక డోసు తీసుకున్నవారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని ట్వీట్‌ చేశారు. కరోనా సమయంలో టీకాలు వేసుకోవాలని సూచిస్తున్నారు. టీకా లాటరీలో తొలి విజేత పేరును మే 26వ తేదీన ప్రకటించనున్నట్టు తెలిపారు. ఇలాగే ప్రతివారం విజేతను మొదటి విజేత లాటరీ తీసి నిర్ణయిస్తారని తెలిపారు.

17ఏళ్ల లోపు వారికి మాత్రం ప్రత్యేకమైన లాటరీ ప్రకటించారు. ఈ లాటరీ స్కీమ్‌లో విజేతలకు ప్రైజ్ మనీ ఉండదు. ఏడాది పాటు స్కూల్‌ స్కాలర్‌షిప్‌ అందించనున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో లాటరీ తీసి గెలిచినవారికి కోట్ల ప్రైజ్ అందించనున్నారు.