Explosion: ట్యాంకర్ లీక్.. ఆయిల్ పట్టుకునేందుకు ఎగబడ్డ జనం.. పేలుడులో 91మంది మృతి

ఆఫ్రికా దేశంలో పశ్చిమాఫ్రికా ప్రాంతంలోని సియెర్రా లియోన్‌ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

Explosion: ట్యాంకర్ లీక్.. ఆయిల్ పట్టుకునేందుకు ఎగబడ్డ జనం.. పేలుడులో 91మంది మృతి

Blast

Explosion: ఆఫ్రికా దేశంలో పశ్చిమాఫ్రికా ప్రాంతంలోని సియెర్రా లియోన్‌ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆశకుపోయినవారు మంటల్లో చిక్కకుని చనిపోయారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 91మంది చనిపోవడంతో సియెర్రాలోని ఫ్రీటౌన్‌లో రోడ్డు మొత్తం శవాల గుట్టలు ఏర్పడ్డాయి.

వివరాల్లోకి వెళ్తే.. ఓ ఆయిల్ ట్యాంకర్‌ను మరో వాహనం ఢీకొట్టడంతో ఆయిల్ ట్యాంకర్ నుంచి ఆయిల్ లీక్ అయ్యింది. దానిని పట్టుకునేందుకు అక్కడకు పెద్ద ఎత్తున జనం చేరుకోగా.. అక్కడ మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా ట్యాంకర్ పేలిపోవడంతో ఆయిల్ సేకరించడానికి వచ్చినవారు మృత్యువాత పడ్డారు.

మరికొంతమంది తీవ్రంగా గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించినట్లుగా అధికారులు చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు 91మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. చుట్టు పక్కల ఉన్న దుకాణాలు, మార్కెట్‌ స్టాల్స్‌, వీధుల్లో నడుస్తున్న జనంపై కూడా ఈ పేలుడు ప్రభావం పడింది.

ఈ ఘటనపై ప్రెసిడెంట్‌ జూలియస్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా పనిచేస్తుందని అన్నారు. గాయపడినవారి చికిత్సకు సాయం చేస్తామని ప్రకటించింది ప్రభుత్వం. అంతుకుముందు ఆయిల్ పట్టుకునేందుకు జనం ఎగబడ్డ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.