Never Get Old : ఎప్పటికీ వృద్దాప్యం రాకుండా ఉండాలంటే ఇవి మానేయండి…

ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? రోగాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మరీ ముఖ్యంగా వృద్దాప్య చాయలు కనిపించకుండా యంగ్ గా కనిపించాలంటే ఏం తినాలి? ఏం తినకూడదు?

Never Get Old : ఎప్పటికీ వృద్దాప్యం రాకుండా ఉండాలంటే ఇవి మానేయండి…

Never Get Old

Never Get Old : ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? రోగాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మరీ ముఖ్యంగా వృద్దాప్య చాయలు కనిపించకుండా యంగ్ గా కనిపించాలంటే ఏం తినాలి? ఏం తినకూడదు? ఏం తాగాలి? ఏం తాగకూడదు? ఇలాంటి సందేహాలు అందరిలోనూ ఉంటాయి. అందంగా, యంగ్ గా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. దీనికి నిపుణులు పలు సూచనలు చేశారు. ఆరోగ్యంగా ఉండాలంటే మరీ ముఖ్యంగా యంగ్ గా కనిపించాలంటే పలు నియమాలు పాటించాలని చెబుతున్నారు. కొన్నింటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం…

1. సోడా తాగడం ఆపేయండి:
యూత్ ఎక్కువగా ఇష్టపడేది సోడా. అయితే అది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. కాలిఫోర్నియా యూనివర్సిటీ-శాన్ ఫ్రాన్సిస్ కో పరిశోధకులు జరిపిన స్టడీలో కీలక విషయాలు వెలుగుచూశాయి. ఎక్కువ షుగర్ ఉండే డ్రింక్స్ అంటే సోడా లాంటివి తాగితే ఆరోగ్యానికి మంచిది కాదు. దాని కారణంగా వయసు పెరిగే కొద్దీ టెలోమీర్స్ తగ్గిపోతాయి. టెలోమీర్స్ మన శరీరంలో డీఎన్ఏని అట్టి పెట్టుకుని ఉంటాయి. మన శరీరంలో టెలోమీర్స్ తగ్గిపోతే మరణం సంభవిస్తుంది. అంతేకాదు రోజూ షుగర్ స్వీటెన్డ్ సోడాస్ తీసుకోవడం వల్ల మెటాబాలిక్ డిసీజ్ డెవలప్ మెంట్ అవుతుందని పరిశోధకులు తెలిపారు.

2. షుగర్ తగ్గించండి:
ఎక్కువ షుగర్ తీసుకుంటే బరువు పెంచుతుంది. అంతేకాదు చిన్న వయసులోనే చాలా పెద్దవాళ్లలా కనిపిస్తారు. మన చర్మాన్ని రెండు కాంపౌండ్స్ సపోర్ట్ చేస్తాయి. అవి కొలాజిన్, ఎలాస్టిన్. వాటి కారణంగా మన చర్మం ఎంతో కాంతివంతంగా కనిపిస్తుంది. అయితే క్లినికల్ డెర్మటాలజీ అనే జర్నల్ లో వచ్చిన స్టడీ ప్రకారం.. ఎక్కువ షుగర్ తీసుకుంటే.. కొలాజిన్, ఎలాస్టిన్ పై ప్రభావం చూపుతుంది. వాటిని డ్యామేజ్ చేస్తుంది. ఫలితంగా చర్మం తన కాంతిని కోల్పోతుంది.

3. స్ట్రెస్ తగ్గించుకోండి:
షుగర్ పదార్దాలను తగ్గించుకోవడంతో పాటు స్ట్రెస్(ఒత్తిడి)ని కూడా తగ్గించుకోవాలి. దీర్ఘకాలం స్ట్రెస్ కు గురైతే టెలోమీర్స్ తగ్గిపోతాయి. ఆ కారణంగా వయసు పైబడినట్టు కనిపిస్తారు. అంతేకాదు టెలోమీర్స్ తగ్గిపోతే తీవ్ర అరోగ్య సమస్యలు(గుండె జబ్బులు, కేన్సర్) వచ్చే ప్రమాదం ఉంది.

4. తక్కువ మోతాదులో డ్రింక్ చేయండి:
ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదు. ఎక్కువ మోతాదులో మద్యం తీసుకుంటే బాడీని డీహైడ్రేట్ చేస్తుంది. చిన్న వయసులోనే ముసలి వాళ్లలా కనిపిస్తారని పరిశోధకులు చెబుతున్నారు. 2019లో ఓ స్టడీ చేశారు. ఇందులో 3200 మంది మహిళలు పాల్గొన్నారు. వారంతా వారంలో 8కి పైగా డ్రింక్స్ తీసుకున్నారు. దీంతో వారి ముఖాల్లో మార్పులు వచ్చాయి. ముసలి చాయలు కనిపించాయని పరిశోధకులు చెప్పారు. అందుకే, మద్యం అతిగా తీసుకోవడం మంచిది కాదన్నారు.

5. తగినంత నిద్ర:
క్లినికల్ అండ్ ఎక్స్ పరిమెంటల్ డెర్మటాలజీలో పబ్లిష్ అయిన స్టడీ ప్రకారం మహిళలు ఎవరైతే బాగా నిద్రపోతారో వారి చర్మం కాంతిమంతంగా తయారైంది. యూత్ ఫుల్ గా కనిపించారు. రాత్రి పూట మహిళలకు 7 నుంచి 9 గంటల పాటు నాణ్యమైన నిద్ర అవసరం అని నిపుణులు చెబుతున్నారు.