రోబో కుక్క.. సామాజిక దూరం పాటించకపోతే అంతే..

  • Published By: Subhan ,Published On : May 9, 2020 / 02:21 PM IST
రోబో కుక్క.. సామాజిక దూరం పాటించకపోతే అంతే..

కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రపంచమంతా లాక్‌డౌన్ వహించింది. 40రోజులకు పైగా ఇళ్లలోనే ఉన్న ప్రజలు ప్రత్యేక అవసరాల కోసం బయటకు వస్తున్నారు. వారి కోసం సామాజిక దూరాన్ని అమలు చేస్తూ జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచనలు ఇస్తున్నా పట్టించుకోవడం లేదు. వీరందరిని దారిలో తీసుకురావాలనే ఉద్దేశ్యంతో సింగపూర్ గవర్నమెంట్ రోబోటిక్ డాగ్‌ను రూపొందించింది. 

నాలుగు కాళ్లతో ఉన్న రోబోటిక్ కుక్క పాట్రోలింగ్ చేస్తూ వీధుల్లో ప్రజలను చెదరగొడుతుంది. ఆ కుక్కకు కెమెరాలు అమర్చిన ఆపరేటర్లు ప్రజలు గుమిగూడి ఉన్న ప్రాంతాల్లో కలియదిరిగింది. ఏ ఒక్కరినో ప్రత్యేకించి టార్గెట్ చేసే కెమెరాలు కాదని.. మనుషులు దగ్గరగా ఉంటే దానికి సిగ్నల్ అందుతుందని వారి వద్దకు వెళ్లి అలర్ట్ చేస్తుందని అధికారులు అంటున్నారు. 

కరోనా కేసులతో సతమతమవుతోన్న దేశాల్లో సింగపూర్ ఒకటి. రెండో వేవ్ ప్రబలడంతో దేశం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. మార్చి 17నుంచి రెండో దశ మొదలై 266కేసుల నుంచి 21వేల 707కేసులకు పెరిగింది. పరిస్థితి దారుణంగా తయారయ్యేకొద్దీ ప్రభుత్వం సాధ్యమైనంత మేర టెక్నాలజీతో ప్రజలను అలర్ట్ చేస్తుంది. 

మార్చి నెలలో కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్.. లాంచ్ చేసి బ్లూ టూత్ సాయంతో వినియోగదారులు ఎంత దూరంలో ఉన్నారనేది ఇట్టే తెలిసిపోతుందని తెలిపింది. రోబోలు ఇంకొక అవసరం కూడా తీరుస్తాయి. లోకల్ ఐసోలేషన్ సెంటర్ నుంచి పేషెంట్లకు మందులు కూడా తీసుకొచ్చి ఇస్తున్నాయి. 

సామాజిక దూరం పాటిస్తున్న ప్రజల వద్దకు వెళ్లి చెక్ చేసి తిరగడానికి మనుషులకైతే దాహం, ఓపిక అవసరమని రోబోలు ఆ పని చక్కగా చేస్తున్నాయని బోస్టన్ డౌనమిక్స్ చెబుతుంది.