Greenest Beer : ‘యూరిన్ తో బీర్ తయారీ’..సూపర్ టేస్ట్ అంటూ..ఎగబడి తాగేస్తున్న మందుబాబులు

'యూరిన్ తో బీర్ తయారీ'..సూపర్ టేస్ట్ అంటూ..ఎగబడి తాగేస్తున్నారట మందుబాబులు.

Greenest Beer : ‘యూరిన్ తో బీర్ తయారీ’..సూపర్ టేస్ట్ అంటూ..ఎగబడి తాగేస్తున్న మందుబాబులు

Beer Urine Singapore Brewery Would Drink (1)

beer urine singapore brewery would drink : బీర్ లందు ఈ బీర్ వేరయా అన్నట్లుగా ఉందీ ఈ బీర్ తయారీ. దాని పేరు ‘యూరిన్ బీర్’. కానీ ‘గ్రీన్ బీర్’అని ప్రచారం చేస్తోంది ఈ బీర్ తయారు చేసే కంపెనీ. బీరు తయారీకి పెద్ద మొత్తంలో నీరు అవసరం అవుతుంది. బీర్ లో 90 శాతం కంటే ఎక్కువగా నీరే ఉంటుంది. కానీ సింగపూర్ లోని ఓ కంపెనీ తయారు చేసే ‘యూరిన్ బీర్’ దేంతో తయారు చేస్తారో తెలిస్తే ‘యాక్’అంటారు. పేరు వింటేనే తెలిసిపోతోంది కదూ దేంతో తయారు చేస్తారో..! కానీ సూపర్ టేస్ట్ గా ఉందని మందుబాబులు ఎగబడి మరీ తాగేస్తున్నారని చెబుతోంది సింగపూర్ లోని ‘న్యూబ్రూ కంపెనీ’.

మీరు విన్నది నిజమే ఈ  బీర్ యూరిన్‌తో తయారు అవుతుంది. ఇంకో షాకింగ్‌ విషయం ఏమిటంటే దాదాపు 20 సంవత్సరాల నాటి మురుగునీటిని శుద్ధిచేసి మరీ తయారుచేస్తున్న ‘యూరిన్ బీర్’ను గ్రీన్ బీర్‌గా ప్రచారం చేస్తోంది..సింగప్‌పూర్‌లోని న్యూబ్రూ కంపెనీ. సింగపూర్ న్యూబ్రూ ఉత్పత్తి చేస్తున్న యూరిన్ బీర్‌కు భారీ ఆదరణ లభిస్తుండటం అంతకంటే విశేషం అని చెప్పాల్సిందే.

పలురకాల పరీక్షలు, వివిధ దశల్లో వడపోత తర్వాత ఆరోగ్యకరమైన బీర్‌ను తయారు చేస్తున్నామని..ఈ బీర్ త్రాగడానికి సురక్షితమని సదరు కంపెనీ చెబుతోంది. అంతేకాకుండా తమ స్పెషల్‌ బీరు ఆరోగ్యానికి ఆరోగ్యం, అద్భుతమైన రుచి కూడా అని కూడా చెప్పుకొస్తోంది.

ఈ యూరిన్ బీర్ విషయంలో మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే..నీటి కొరతపై అవగాహన కల్పించేందుకు ప్రచారం చేపట్టిన ప్రభుత్వ నీటి సంస్థ దీన్ని అధిగమించేందుకు వినూత్న పరిష్కారాల్ని అన్వేషిస్తోంది. బీర్‌లో 90 శాతం నీరు ఉంటుందనీ అందుకే అల్ట్రా-క్లీన్ హై-గ్రేడ్ రీసైకిల్ వాటర్‌తో తయారుచేస్తున్నామని కంపెనీ తెలిపింది. సింగపూర్ ఇంటర్నేషనల్ వాటర్ వీక్‌, వాటర్ కాన్ఫరెన్స్‌లో నేషనల్ వాటర్ ఏజెన్సీ, స్థానిక క్రాఫ్ట్ బీర్ బ్రూవరీ ‘Brewerkz’ న్యూబ్రూ ఏప్రిల్ 8న ప్రారంభించింది. నీటి రీసైక్లింగ్, పునర్వినియోగంపై అవగాహన కల్పించేందుకే న్యూబ్రూ సింగపూర్ ‘గ్రీనెస్ట్ బీర్’ ఆవిష్కరణ అని కంపెనీ ఎండీ ర్యాన్ యుయెన్ వెల్లడించారు. కాగా..ప్రపంచవ్యాప్తంగా నీళ్లు, టీ, తరువాత అత్యంత ప్రజాదరణ పొందిన పానీయం బీర్‌.