వీడియో కాల్‌లో మరణశిక్ష తీర్పు ప్రకటించిన జడ్జి

  • Published By: Subhan ,Published On : May 20, 2020 / 08:28 AM IST
వీడియో కాల్‌లో మరణశిక్ష తీర్పు ప్రకటించిన జడ్జి

వీడియో కాల్స్ లో పలకరింపులు, బర్త్ డే సెలబ్రేషన్లు చూశాం. ఈ లాక్‌డౌన్ పుణ్యమా అని వీడియో కాల్స్ లోనే పెళ్లిళ్లు చేసుకోవడం కూడా చూస్తున్నాం. సింగపూర్ లో జరిగిన మరో ఘటన వైరల్ అయింది. జూమ్ వీడియో కాల్ ద్వారా ఓ వ్యక్తికి మరణశిక్ష ఖరారు అయింది.

పుణీతన్ గణేశన్ అనే 37ఏళ్ల మలేసియాకు చెందిన వ్యక్తి  2011లో హెరాయిన్ స్మగ్లింగ్ చేశాడనే కేసు విచారణ జరిగింది. కరోనా నేపథ్యంలో ఆన్ లైన్ లోనే విచారణ జరిపిన కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. అందరి సేఫ్టీ దృష్టిలో ఉంచుకుని వీడియో కాన్ఫిరెన్స్ ను ఆన్ లైన్లో నిర్వహిస్తున్నాం.. స్మగ్లింగ్‌కు సంబంధించి తొలి మరణశిక్ష నమోదు చేసిన కేసు ఇదే. 

గణేశన్ లాయర్ పీటర్ ఫెర్నాండో జడ్డి తీర్పును వీడియో కాల్ ల ప్రకటించారని.. చాలా మంది ఈ పద్ధతిని వ్యతిరేకిస్తున్నా తాము సమ్మతిస్తున్నామని తెలిపాడు. ఎటువంటి వాదనలు వినిపించలేదు. కేవలం జడ్జి తీర్పును మాత్రమే ఇచ్చారు. కాలిఫోర్నియాకు చెందిన జూమ్ కంపెనీ సింగపూర్ లో ఉన్న రిప్రజంటేటివ్స్ ద్వారా వచ్చిన రిక్వెస్ట్ ను ముందు పట్టించుకోలేదు.  ఆ తర్వాత వీడియో కాల్ ద్వారా తీర్పుకు ఏర్పాటు కుదిరింది. 

సింగపూర్ డ్రగ్స్ విషయంలో వందల మందికి ఉరిశిక్ష విధించింది. అందులో డజన్లకొద్దీ విదేశీయులు కూడా ఉన్నారు. దశాబ్దాల నుంచి సింగపూర్ లో నార్కొటిక్ ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వీడియో కాల్ తీర్పుపై మానవ హక్కుల కమిషన్ డిప్యూటీ డైరక్టర్ ఫిల్ రాబర్ట్ సన్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘వీడియో కాల్ ద్వారా సింగపూర్ మరణశిక్షను విధించడం అమానవీయం, క్రూరమైన చర్యగా భావిస్తున్నాం’ అని ఆరోపించారు. 

Read: కరోనా దెబ్బకు బ్రిటన్ పార్లమెంటును మోడ్రాన్ వీడియో కాన్ఫరెన్స్ సెంటర్‌గా మార్చేశారు!