Sperm Donor: 60మంది పిల్లలకు ఒక్కడే తండ్రి..! స్పెర్మ్ డోనర్ చేసిన పనికి తలలు పట్టుకున్న తల్లిదండ్రులు ..

60 మంది చిన్నారుల ముఖాలు ఒకే పోలికను కలిగి ఉండటంతో కంగారుపడిన తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకొని అసలు ఇదెలా సాధ్యమైందని ఆరా తీశారు. ఆస్పత్రి వర్గాలు పిల్లల వివరాలను సేకరించిన తరువాత వీరందరికీ ఒక్కడే తండ్రి అని తేల్చారు.

Sperm Donor: ఆస్ట్రేలియాలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. స్పెర్మ్ డోనర్ చేసిన పని 60 మంది పిల్లల తల్లిదండ్రులు తల్లలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆస్ట్రేలియాలో కొద్దిరోజుల క్రితం ఓ ప్రాంతంలో పిల్లల పార్టీ జరిగింది. ఆ పార్టీలో పాల్గొనేందుకు అనేక మంది చిన్నారులు అక్కడికి చేరుకున్నారు. అయితే, వారిలో 60 మంది పిల్లలు దాదాపు ఒకే రూపాన్ని కలిగి ఉండటాన్ని చూసి అక్కడివారంతా అవాక్కయ్యారు. పిల్లల తల్లిదండ్రులు సైతం వారి పిల్లలు ఎవరో గుర్తించేందుకు నానా తంటాలు పడాల్సి వచ్చింది. పిల్లలంతా ఒకే పోలికను కలిగి ఉండటం ఎలా సాధ్యమైందని ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Fathered 129 Children : ఏకంగా 129 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు

60 మంది చిన్నారుల ముఖాలు ఒకే పోలికను కలిగి ఉండటంతో కంగారుపడిన తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకొని అసలు ఇదెలా సాధ్యమైందని ఆరా తీశారు. ఆస్పత్రి వర్గాలు పిల్లల వివరాలను సేకరించిన తరువాత వీరందరికీ ఒక్కడే తండ్రి అని తేల్చారు. గత కొన్నేళ్లుగా స్పెర్మ్ దానం చేసే ట్రెండ్ ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతూ వస్తోంది. వేరేవారి స్పెర్మ్‌తో పిల్లలను కనడం సాధారణ విషయంగా మారిపోయింది. స్థానిక నిబంధనల ప్రకారం.. ఒక దాత ఒక్కసారే స్పెర్మ్‌ను ఉపయోగించవచ్చని నిబంధన ఉంది. అయితే, స్పెర్మ్ దాత నిబంధనలకు విరుద్ధంగా నకిలీ పత్రాలు జతచేసి నాలుగైదు సార్లు స్పెర్మ్ ను దానం చేసినట్లు వైద్యులు గుర్తించారు.

Sperm Quality In Men : మగవారిలో స్పెర్మ్ నాణ్యత తగ్గిపోవటానికి కొన్ని ఆహారాలే కారణమా?

నకిలీ పత్రాలతో.. LGBTQ+ కమ్యూనిటీలోని చాలా మంది సభ్యులకు సదరు వ్యక్తి స్పెర్మ్ దానం చేశాడు. ఈ దారుణాన్ని ఎవరూ గుర్తించకపోవటంతో ఇప్పుడు పిల్లల తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. నిజానికి వీరంతా వేరువేరు ప్రాంతాల్లో పుట్టిన వారే. అయిన, ఓ పార్టీ విషయంలో ఒకే దగ్గరకు చేరడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

ట్రెండింగ్ వార్తలు