వన్యమృగ పార్కులో విషాదం : సరస్సులో పడి ఆరు ఏనుగులు మృతి

  • Published By: madhu ,Published On : October 7, 2019 / 03:59 AM IST
వన్యమృగ పార్కులో విషాదం : సరస్సులో పడి ఆరు ఏనుగులు మృతి

థాయిలాండ్‌లో విషాద ఘటన ఒకటి చోటు చేసుకుంది. జలపాతం నుంచి కింద పడిన ఏనుగు రక్షించేందుకు మరో ఏనుగు..దీనిని కాపాడేందుకు మరో ఏనుగు..ఇలా..ఒకదాని వెంట..ఏనుగులు వెళ్లి మృతి చెందాయి. ఈశాన్య థాయిలాండ్ ప్రాంతంలో అక్టోబర్ 05వ తేదీ శనివారం చోటు చేసుకుంది. ఘటనకు గల కారణాలను అధికారులు విశ్లేషిస్తున్నారు. ఏనుగులు మృతి చెందడంతో జలపాత సందర్శనను అధికారులు మూసివేశారు. అంతకుముందు రాత్రి భారీ వర్షం పడినట్లు పార్క్ ప్రతినిధి వెల్లడించారు. 

Read More :అమెరికాలో మరోసారి కాల్పులు : నలుగురు మృతి
ఖోయోయాయి అనే జాతీయ పార్కులో ఏనుగులున్నాయి. హ్యూ నారోక్ జలపాతం వద్ద ఏనుగుల ఆర్తనాదాలు వినిపించాయి. వెంటనే అక్కడకు చేరుకున్న సిబ్బంది జలపాతంలో చిక్కుకున్న రెండు ఏనుగులను రక్షించారు. అక్కడే ఆరు ఏనుగులు విగతజీవులుగా పడి ఉన్నాయి. నీటిలో పడిపోతున్న ఏనుగులను రక్షించేందుకు యత్నించి రెండు ఏనుగులు చిక్కుకున్నట్లు తెలుస్తోందని అధికారులు వెల్లడించారు. స్థానికులు ఈ జలపాతాన్ని నరక జలపాతం అని పిలుస్తుంటారు. 1992లో ఇదే విధంగా ఇక్కడ 8 ఏనుగులు మృతి చెందాయి. 
Six wild elephants found dead at “Haew Narok Waterfall” in Thailand, at the same place where it happened as well in 1992. pic.twitter.com/naXD9ubttP