Gun Shoots In US School : అమెరికా స్కూల్లో టీచర్‌పై ఆరేళ్ల బాలుడి కాల్పులు .. కావాలనే కాల్చాడంటున్న పోలీసులు

గన్ కల్చర్‌కు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న అమెరికాలోని ఓ స్కూల్లో మరోసారి గన్ ఘర్జించింది. స్కూల్లో ఆరేళ్ల పిల్లాడు టీచర్ పై తుపాకీతో కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన ఆ టీచర్ ప్రాణాలతో పోరాడుతోంది. 

Six Year Boy Shoots Teacher In US School : గన్ కల్చర్‌కు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న అమెరికాలోని ఓ స్కూల్లో మరోసారి గన్ ఘర్జించింది. స్కూల్లో ఆరేళ్ల పిల్లాడు టీచర్ పై తుపాకీతో కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన ఆ టీచర్ ప్రాణాలతో పోరాడుతోంది. సాధారణంగా మనదేశంలో అయితే పిల్లలు స్కూళ్లకు బుక్స్ లంచ్ బాక్సులు పట్టుకెళతారు. అదే అమెరికాలో అయిన స్కూల్ బ్యాగ్ లో గన్నులు కూడా పట్టుకెళతారు. అలా పట్టికెళ్లిన గన్ తో సరదాగా కాల్పులు జరపటం ఎవరోకరు ఆ గన్ తూటాలకు బలికావటం జరుగుతుంటుంది. అదే జరిగిందో అమెరికాలోని ఓ స్కూల్లో..అది కూడా ఓ ఎలిమెంటరీ స్కూల్లో. ఆరేళ్ల పిల్లాడు స్కూల్ కు గన్ తీసుకొచ్చాడు. దాన్ని టీచర్ కు గురి పెట్టి కాల్చాడు అంతే గన్ తో తూటా దూసుకుపోయింది టీచర్ ను తీవ్రంగా గాయపరిచింది.

వర్జీనియాలోని రిచ్‌నెక్ ఎలిమెంటరీ స్కూల్‌లో శుక్రవారం (జనవరి 6,2023) ఆరేళ్ల విద్యార్థి గన్ తో కాల్పుటు జరపటంతో ఓ టీచర్ తీవ్రంగా గాయపడగా ఇప్పుడా టీచర్ ప్రాణాలతో పోరాడుతున్న పరిస్థితి. ఈ ఘటనలో క్లాసులో ఉన్న మిగిలిన విద్యార్థులు ఎవరికీ ఏమీ కాకపోవటం పెను ప్రమాదం తప్పిందంటున్నారు స్కూల్ టీచర్లు. ఆరేళ్ల బాబు గన్ తో కాల్చిన ఘటన తనను షాక్ కు గురించేసిందని స్కూల్స్ సూపరింటెండెంట్ జార్జ్ పార్కర్ అన్నారు.

వర్జీనియా రాష్ట్రంలోని రిచ్నెక్ ఎలిమెంటరీ స్కూలులో శుక్రవారం కాల్పులు జరిపిన కుర్రాడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగింది కాదని పోలీసుల ప్రాథమిక విచారణలో తేల్చారు. ఆ కుర్రాడి చేతికి గన్ ఎలా వచ్చిందనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

టీనేజ్ పిల్లలకు తుపాకులు అందుబాటులో లేకుండా చూడాలని తల్లిదండ్రులకు ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా..2022లో అమెరికాలో జరిగిన తుపాకీ కాల్పుల ఘటనల్లో 44 వేల మంది చనిపోయారని..వీటిలో దాదాపు సగం హత్యలు, ప్రమాదాలు, ఆత్మరక్షణ కోసం జరిగినవి కాగా, మరో సగం ఆత్మహత్యలని తెలిపారు పోలీసులు. టెక్సాస్‌లోని ఉవాల్డేలో 18 ఏళ్ల బాలుడు ఇద్దరు టీచర్లతో సహా 19మంది పిల్లలను కాల్చి చంపాడు.

 

ట్రెండింగ్ వార్తలు