ఆరేళ్ల పిల్లాడికి దొరికిన మిలియన్ల ఏళ్లనాటి అరుదైన శిలాజం

తోటలో సరదాగా ఆడుకుందాని వెళ్లిన ఓ పిల్లాడికి మిలియన్ల ఏళ్లనాటి అరుదైన శిలాజాలు దొరికాయి. ఆరేళ్ల పిల్లాడికి కొన్ని మిలియన్ల ఏళ్ల నాటి శిలాజాలు దొరికాయి. వాటినికి చూసిన ఆ చిన్నారి అవేంటా అని తిరగా మరగా వేసి చూశాడు. చూడటానికి అవి కొత్తగా కనిపించాయి.

ఆరేళ్ల పిల్లాడికి దొరికిన మిలియన్ల ఏళ్లనాటి అరుదైన శిలాజం

Six Year Boy In Uk Finds  488 Millions Of Years Ago (1)

Six Year Boy in UK Finds  488 Millions of Years Ago : తోటలో సరదాగా ఆడుకుందాని వెళ్లిన ఓ పిల్లాడికి అరుదైన శిలాజాలు దొరికాయి. ఆరేళ్ల పిల్లాడికి కొన్ని మిలియన్ల ఏళ్ల నాటి శిలాజాలు దొరికాయి. వాటినికి చూసిన ఆ చిన్నారి అవేంటా అని తిరగా మరగా వేసి చూశాడు. చూడటానికి అవి కొత్తగా కనిపించాయి. ఏదో వింతగా అనిపించాయి. వాటిని చూసిన ఆ పసిపిల్లాడు ఆనందం ఆడుకున్నాడు. కానీ అవేంటో ఆ పసివాడకి తెలియదు. వాటిని తండ్రికి దగ్గరకు పట్టుకెళ్లి చూపించగా అవో అద్భుతమైన శిలాజాలనీ..తెలిసి ఆశ్చర్యపోయాడా తండ్రి ఆనందం వ్యక్తంచేశాడు.

3

అద్భుతమైన, అరుదైన శిలాజాలను కనుగొన్న ఆ ఆరేళ్ల పిల్లాడి కుటుంబం యూకేలోని ఇంగ్లండ్‌లోని వెస్ట్ మిడ్‌ల్యాండ్స్ ప్రాంతంలో నివసిస్తోంది. పేరు సిద్ధాఖ్ సింగ్ జామత్. సిద్ భారత సంతతకి చెందిన పిల్లాడు. క్రిస్‌మస్ పండుగ సందర్భంగా తన తండ్రి కొనిచ్చిన గిఫ్ట్‌ పాజిల్-హంటింగ్ సెట్ట్ తీసుకుని సిద్ ఆడుకోవటానికి తోటలోకి వెళ్లాడు. అక్కడ ఆడుతూ ఆడుతూ ఓ పెద్ద కనిపిస్తే దాని దగ్గరకెళ్లాడు.

9

 

అక్కడ తవ్వుతుండగా..ఆ పెద్దబండరాయి దగ్గర ఏదో కొమ్ములాంటిది కనిపించింది. అదేంటాని దాన్ని లాగి చూశాడు. బైటకొచ్చిందది. దాన్ని అటూ ఇటూ తిప్పి చూశాడు. అది ఓ జంతువుకు సంబంధించిన దంతం లేదా ఓ కొమ్ము అనుకున్నాడా పిల్లాడు. దాన్ని చూసిన ఆ పసివాడికి అదేదో వింతగా కనిపించేసరికి తానేదో సాధించేసినట్లుగా ఫీల్ అయ్యిందా పసి మనస్సు. కానీ అది నిజమేనని తెలియదు. దాన్ని పట్టుకుని తండ్రి దగ్గరకెళ్లి చూపించాడు.

6

దాన్ని చూసిన సిద్ తండ్రి మొహంలో వింత వింత మారుతున్న ఎక్స్ ప్రెషన్స్ చూసిన సిద్ ‘‘అదేంటి డాడీ’’ అని అడిగాడు. దాన్ని ‘‘హర్న్ కోరల్’’ అని అంటారని చెప్పాడు. అదొక శిలాజం అని అది కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితానిదని చెప్పాడు. కానీ పిల్లాడికి కాస్త అర్థం అయ్యీ అవ్వనట్లుగా ఉంది. కానీ అదోదో గొప్పదేనని అనుకునాడు.

7

ఆ శిలాజం దొరికాక తన కొడుకుకు దొరటం చాలా సంతోషంగా ఉందనీ..తెలిపాడు ఫేస్‌బుక్‌లో ఓ శిలాజాల గ్రూపులో మెంబర్‌గా ఉన్న సిద్ తండ్రి విష్ సింగ్. అతడి ద్వారే సిద్‌కు దొరికిన శిలల గురించి వెలుగులోకి వచ్చింది. కాగా.. ఆ శిలాజాలు దాదాపుగా 251 నుంచి 488 మిలియన్ సంవత్సరాల క్రితం నాటివని తెలుస్తోంది.