Slippers Saved Woman Life : మహిళ ప్రాణం కాపాడిన చెప్పులు

ఓ మహిళ ధరించిన చెప్పులు ఆమె ప్రాణాలనే కాపాడాయి. నేను ధరించిన చెప్పులే నా ప్రాణాలను కాపాడాయి అంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపిందామె.

Slippers Saved Woman Life : మహిళ ప్రాణం కాపాడిన చెప్పులు

slippers Saved Woman Life : ఆమె పేరు కెర్రీ టాటర్ స్లీ. యూఎస్ కు చెందిన కెర్రీ ప్రాణాలను ఓ కంపెనీ తయారు చేసిన ‘చెప్పులు’కాపాడాయి. చెప్పులేంటీ ప్రాణాలు కాపాడటమేంటీ అనే అనుమానం వస్తుంది. నిజమే..ఒకోసారి ప్రాణం లేనివి కూడా ప్రాణాలు కాపాడతాయి. అవే ప్రాణదాతలుగా మారతాయి. కెర్రీ విషయంలో కూడా అదే జరిగింది. ఓ ప్రమాదం నుంచి ఆమె ధరించిన చెప్పులు ఆమె ప్రాణాలు కాపాడాయి. కెర్రీ టాటర్ స్లీ ప్రతీరోజులాగానే తన ఇంట్లో పనులు చేసుకుంటుంది. ఈక్రమంలో పెరటులో ఉన్న కరెంట్ బటన్ లను ఆఫ్ చేయడానికి వెళ్లింది. అప్పుడు ఆమె పూమా చెప్పులు వేసుకుని ఉంది. అయితే.. స్విచ్ బోర్డును ముట్టుకుందో లేదో తీవ్రమైన కరెంట్ షాక్ తగిలి విసిరేసినట్లుగా అంత దూరం ఎగిరిపడింది. అంతా క్షణాల్లో జరిగిపోయింది.

ఈ విషయాన్ని గమనించిన ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కెర్రీ టాటర్ ను టెస్ట్ చేసిన డాక్టర్లు ఆమె చెప్పులు ధరించటం వల్లనే బతికి బయటపడిందని లేదంటే తీవ్రమైన విద్యుత్ షాక్ తో ప్రాణాలు కోల్పోయి ఉండేదని తెలిపారు. ఆమె చెప్పులు ధరించి ఉండటం వలన ఆమె శరీరంలో కరెంట్ సరఫరా కాలేదని..లేదంటే ప్రాణాలు పోయి ఉండేవని తెలిపారు. ఈ ప్రమాదం నుంచి  కోలుకున్న కెర్రీ మాట్లాడుతూ..నేను 2,800 పెట్టి కొన్న పూమా చెప్పులే నా ప్రాణాలు కాపాడిందని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టింది. దీంతో అదికాస్తా వైరల్ గా మారింది.

కాగా..వర్షాకాలం కరెంట్ తో చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. వర్షంలో ఎక్కడైన పొరపాటున విద్యుత్ వైర్లు జాయింట్ లు తెగిపోతే.. అక్కడ కరెంట్ ప్రసరిస్తుంది. అలాగే కరెంట్ స్తంభాలలో కూడా ఎర్తింగ్ వస్తు ఉంటుంది. ఇటువంటి సమయంలో వాటిని తాకితే ప్రాణాలు పోవచ్చు. కానీకరెంట్ పనులు చేసేటప్పుడు రబ్బరు చెప్పులు ధరించి చేస్తే ప్రమాదం తప్పే అవకాశం ఉంది. రబ్బలు చెప్పులు ధరిస్తే కరెంట్ షాక్ కొట్టదు.అలాగే కరెంట్ వైర్లు కదిలించే సమయంలో కర్రలను ఉపయోగించినా షాక్ కొట్టదు. ఎందుకంటే కర్రలు,రబ్బరు గుండా కరెంట్ ప్రసరించదు. అందుకే చాలా మంది వీటిని ఉపయోగిస్తుంటారు. అయితే.. ఒక మహిళ తనకు తెలియకుండా రబ్బరుచెప్పులు వేసుకొవడం వలన ప్రాణాలతో బయటపడింది. అంతే తప్ప అది సదరు కంపెనీ గొప్పతనం ఏమి కాదనే విషయాన్ని గమనించాలి.