కరోనాను గుర్తించేందుకు స్మార్ట్ హెల్మెట్లు

  • Published By: madhu ,Published On : March 9, 2020 / 02:37 AM IST
కరోనాను గుర్తించేందుకు స్మార్ట్ హెల్మెట్లు

ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. చైనాలో వచ్చిన ఈ వైరస్ క్రమక్రమంగా వివిధ ధేశాలకు పాకుతోంది. చైనాలో వేలాది మంది చనిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా 104 దేశాలకు కరోనా వ్యాపించింది. ఈ వ్యాధి బారిన 1 లక్షా 9వేల 823 మంది పడినట్లు తెలుస్తోంది. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 3 వేల 804 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో చైనా ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకొంటోంది.(కరోనా ఎఫెక్ట్ : అరుణాచల్ ప్రదేశ్‌లో విదేశీయులపై నిషేధం!)

ఓ వైపు వైరస్‌కు విరుగుడు కనిపెట్టేందుకు ప్రయత్నాలు..మరోవైపు వైరస్‌ వ్యాపించకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు చేపడుతున్నారు. వ్యాధి బారిన పడిన వారిని ప్రత్యేక వార్డులు కేటాయించి చికిత్స అందిస్తున్నారు. హై టెంపరేచర్స్, వైరస్ లక్షణాలను గుర్తించే పనిలో పడిపోయారు అధికారులు. కానీ కొంతమంది పరీక్షలు నిర్వహిస్తూ..వారు వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా వైరస్ సోకిన అనుమానితులను గుర్తు పట్టేందుకు…స్మార్ట్ హెల్మెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇందులో శక్తివంతమైన ఇన్‌ప్రారెడ్ సెన్సర్లు, కెమెరాలున్నాయి. వీటిని ఆ దేశ పోలీసులకు అందచేశారు. ఈ స్మార్ట్ హెల్మెట్‌లను ధరించి..రోడ్లపై నిలబడగానే..ఎదురుగా వచ్చే వారి టెంపరేచర్స్ పసిగడుతాయి. వారి ఉష్ణోగ్రతలు ఎంతున్నాయి ? అనేది ఐదు మీటర్ల దూరం నుంచే హెల్మెట్ లెక్కిస్తుందని అధికారులు వెల్లడించారు. ఒకవేళ హై టెంపరేచర్స్ ఉంటే..వెంటనే హెల్మెట్‌లో ఉన్న అలారం మోగుతుందన్నారు. ప్రస్తుతం వీటిని ధరించి..మనుషుల ఉష్ణోగ్రతలను అంచనా వేస్తున్నారు. ఈ మేరకు పీపుల్స్ డైలీ చైనా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది. 

తాజాగా ఆ దేశంలో 133 మంది మృతి చెందారు. ఒక్కరోజులోనే 1 వేయి 247 కేసులు పాజిటివ్‌గా తేలాయి. ఈ నేపథ్యంలో లొంబార్టీ, మిలాన్‌ నగరాలు, పరిసర ప్రాంతాల్లో ప్రజల కదలికలపై కఠిన ఆంక్షలు విధించారు. కరోనా బారిన పడి ఇప్పటి వరకూ 366 మంది చనిపోయారు. మరోవైపు ఇరాన్ లోనూ కరోనా విజృంభిస్తోంది. ఆ దేశంలో ఒక్క రోజే 49 మంది మృతి చెందారు. కోవిడ్-19 కారణంగా దేశంలో గత 24 గంటల్లో 49 మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

దేశంలో కరోనాతో ఇప్పటివరకు 194 మంది ప్రాణాలు కోల్పోయారు. 6566 మంది కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. ఇరాన్‌లో అక్కడా, ఇక్కడా అని కాకుండా మొత్తం 31 ప్రావిన్సులకు కరోనా పాకింది. తన ప్రభావం చూపుతోంది.

 

See Also | 33 ఏళ్ళ నటితో 51 ఏళ్శ విలన్ డేటింగ్