Russian software: స్మార్ట్‌ఫోన్‌లలో ప్రభుత్వ సాఫ్ట్‌వేర్ కచ్చితంగా ఉండాలంటోన్న రష్యా

ఫోన్ లో ట్యాపింగ్, కంటిన్యూ బటన్లు ప్రెస్ చేసినప్పుడు రష్యా తయారుచేసిన యాప్ ల లిస్టుకు

Russian software: స్మార్ట్‌ఫోన్‌లలో ప్రభుత్వ సాఫ్ట్‌వేర్ కచ్చితంగా ఉండాలంటోన్న రష్యా

Android device

Russian software: రష్యా ఇప్పుడు ప్రతి ఎలక్ట్రానికి డివైజ్, ఎలక్ట్రికల్ డివైజ్ లలో అంటే ఫోన్స్, కంప్యూటర్, టీవీలలో కచ్చితంగా రష్యా సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసి ఉండాలనే చట్టం తీసుకొచ్చింది. కొందరు స్థానికులు దీనిని వ్యతిరేకిస్తూ ఆరోపిస్తున్నారు. దేశంలో ప్రొడక్షన్ అవుతున్న డివైజ్ లన్నింటిలో గురువారం నుంచి ఉండాలని చట్టం చెబుతుంది.

ఇంటర్నేషనల్ కంపెనీలతో పోటీపడటానికి రష్యాకు హెల్ప్ గా మారుతుందని అంటున్నారు. తమ యూజర్లు రష్యన్ సాఫ్ట్ వేర్ ఇన్ స్టాల్ చేసుకోవడానికి యాపిల్ సంస్థ గత నెలలోనే అంగీకారాన్ని తెలియజేసింది. కాకపోతే రష్యన్ డెవలపర్స్ రెడీ చేసిన యాప్ లు ఫోన్ లో ఇన్ స్టాల్ చేసే ముందు యాపిల్ ప్రైవసీ, సెక్యూరిటీ పాలసీలకు అనుగుణంగానే ఉండాలనే ఆంక్షలు గుర్తు చేశారు.

దానికి అర్థం.. విదేశీ యాప్ ల కంటే రష్యా యాప్ లను ఎంచుకోవడానికి హెల్ప్ అవుతుంది. గురువారం ఐఓఎస్ డెవలపర్ ఒకరు.. కొత్త సెటప్ గురించి ట్విట్టర్ ద్వారా వీడియో కూడా షేర్ చేశారు.

రష్యా లీగల్ అవసరాల దృష్ట్యా అందుబాటులో ఉన్న యాప్ లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అయితే ఫోన్ లో ట్యాపింగ్, కంటిన్యూ బటన్లు ప్రెస్ చేసినప్పుడు రష్యా తయారుచేసిన యాప్ ల లిస్టుకు తీసుకుపోతుంది. అక్కడ సెర్చ్ జయింట్ యాండెక్స్ కూడా అందుబాటులో ఉంటుంది.

అమెరికాకు చెందిన టెక్ కంపెనీలను క్రాక్ చేయడానికి రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇంటర్నెట్ అదుపు చేయడానికి ప్రయత్నిస్తుంది. గత నెలలో ట్విట్టర్ నిషేదిత కంటెంట్ ను పోస్టు చేయడంతో దేశంలో ట్విట్టర్ వినియోగాన్ని స్లో డౌన్ చేసేసింది. ఇంకా చాలా డొమైన్లను కూడా బ్లాక్ చేయడం మొదలుపెట్టింది.