Beluga whale : వావ్ బెలూగా వేల్..అచ్చు బెలూన్ లా ఉందే..!! Soft toy or whale..?

Beluga whale : వావ్ బెలూగా వేల్..అచ్చు బెలూన్ లా ఉందే..!!

ఈ బెలుగా తిమింగ‌లాన్ని చూడండీ అచ్చంగా బెలూన్ లా ఎంత మెత్తగా ర‌బ్బ‌రు బొమ్మ‌లా ఉందో..!

Beluga whale : వావ్ బెలూగా వేల్..అచ్చు బెలూన్ లా ఉందే..!!

Beluga whale : స‌ముద్రాల్లో తిమింగలాల గురించి ఎన్నో విషయాలు విని ఉంటాం. నున్నగా ఉండే అత్యంత భారీ శరీరంతో భలే భలే ఫీట్లు చేసే తింగలాల ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి కోవ‌కు చెందిన‌దే ఈ బెలుగా తిమింగ‌లం. మృదువుగా..తెల్లగా..మెత్త‌టి త‌లతో అచ్చం ఓ ర‌బ్బ‌రు బొమ్మ‌లా ఉంటుంది. ఈ తిమింగ‌లానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

బెలుగా వేల్ వీడియోను రెడ్డిట్‌లో ఒక‌రు షేర్ చేశారు. ఈ తిమింగ‌లం త‌ల‌ను అక్వేరియం సంద‌ర్శ‌కుడు చేతితో తాకుతుంటే మెత్త‌ని స్పాంజిలా లోప‌లికి పోవ‌డం చూస్తుంటే భలే గమ్మత్తుగా అనిపిస్తోంది. అలా త‌ల‌పై ఒత్త‌గానే అది నోరు తెరిచింది. అలా దాన్ని చూస్తుంటే అచ్చంగా రబ్బరు బొమ్మలా అనిపిస్తోంది. దాన్ని తలను తాకుతున్న సదరు సంద‌ర్శ‌కుడు దాని నోట్లోకి చేలు విస‌ర‌గా, ఎంచ‌క్కా తినేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

×