Solar Storm Hit Earth : భూమిని చుట్టుముట్టి వెళ్లిపోయిన భారీ సౌర తుఫాను

ఓ భారీ సౌర తుఫాను భూమి వైపు దూసుకొస్తోందనీ..అది భూమిని అత్యంత వేగంగా ఢీ కొట్టనుందని వార్తలు విన్నాం. దీని వల్ల కాస్త ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని నిపుణులు అంచనా వేశారు. కానీ పెద్దగా ఇబ్బందులేవీ పెట్టకుండానే ఈ భారీ సౌర తుఫాను భూమిని అలా తాకి ఇలా వెళ్లిపోయింది.

Solar Storm Hit Earth : భూమిని చుట్టుముట్టి వెళ్లిపోయిన భారీ సౌర తుఫాను

Solar Storm Hit Earth

Solar Storm Hit Earth : ఓ భారీ సౌర తుఫాను భూమి వైపు దూసుకొస్తోందనీ..అది భూమిని అత్యంత వేగంగా ఢీ కొట్టనుందని వార్తలు విన్నాం. దీని వల్ల కాస్త ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని నిపుణులు అంచనా వేశారు. కానీ పెద్దగా ఇబ్బందులేవీ పెట్టకుండానే ఈ భారీ సౌర తుఫాను భూమిని అలా తాకి ఇలా వెళ్లిపోయింది. ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా భూమిని అలా చుట్టుముట్టి వెళ్లిపోయింది. బుధ‌వారం (జులై 14,2021)సాయంత్రం భూమిని చుట్టుముట్టి వెళ్లిపోయిందని అమెరికాకు చెందిన నేష‌న‌ల్ ఓషియానిక్ అండ్ అట్మాస్పియ‌రిక్ అడ్మినిస్ట్రేష‌న్ (ఎన్ఓఏఏ) వెల్ల‌డించింది. కొన్ని గంట‌ల పాటు ఈ సౌర గాలులు భూమిని చుట్టుముట్టిన‌ట్లు తెలిపింది. అయితే వీటి కార‌ణంగా గుర్తించ‌ద‌గిన మార్పులేమీ సంభ‌వించ‌లేదని స్ప‌ష్టం చేసింది. ఈ తుఫాను వల్ల భూమివైపు క‌మ్యూనికేష‌న్ వ్య‌వ‌స్థ‌పై ప్ర‌భావం ప‌డ‌నుంద‌న్న వార్త‌లు కూడా విన్నాం. అయితే ఆ తుఫాను భూ అయాస్కాంత క్షేత్రంపై మాత్రం కాస్త ప్ర‌భావం చూపిన‌ట్లు ఎన్ఓఏఏ తెలిపింది.

ఈ సౌర తుఫాను భార‌త కాల‌మానం ప్ర‌కారం బుధవారం రాత్రి 10.11 స‌మ‌యంలో భూమిని చుట్టుముట్టి వెళ్లిపోయింది. దీని జియోమాగ్నెటిక్ కే-ఇండెక్స్ 4గా ఉంది. కే-ఇండెక్స్ అనేది జియోమాగ్నెటిక్ తుఫానుల తీవ్ర‌త‌ను తెలిపే సూచిక‌. లెవ‌ల్ 4 సూచిస్తోందంటే ఇది స్వ‌ల్ప‌మైన ప్ర‌భావం చూపిన‌ట్లు అర్థం. ఈ సౌర తుఫాను కార‌ణంగా బ‌ల‌హీనమైన ప‌వ‌ర్ గ్రిడ్ ఫ్ల‌క్చువేష‌న్లు క‌నిపించాయ‌ని, ఇక కెన‌డా, అలాస్కాలాంటి ప్రాంతాల్లో అరోరాలు కూడా క‌నిపించిన‌ట్లు ఎన్ఓఏఏ వెల్ల‌డించింది.

ఈ సౌర తుఫాను కంటికి క‌నిపించ‌దు. భూమిపై ఉన్నవారికి ఎటువంటి హానీ కలిగించదు. కానీ అది కంటికి కనిపించకపోయినా..భూవాసులకు ప్రమాదం క‌లిగించ‌క‌పోయినా.. దీని ప్రభావం మాత్రం పవర్ గ్రిడ్లను పనిచేయకుండా చేయగలదు. ఈ సౌర తుఫాను ద్వారా వచ్చిన జియోమాగ్నెటిక్ వేవ్స్ ప‌వ‌ర్ గ్రిడ్ల‌ను ప‌ని చేయ‌కుండా చేయ‌గ‌ల‌వు. అలాగే రేడియో క‌మ్యూనికేష‌న్లపై ప్ర‌భావం చూప‌గ‌ల‌వు. అలా 2017లో వచ్చిన సౌర తుఫాను రేడియో క‌మ్యూనికేష‌న్ల‌ను దెబ్బ‌తీశాయి. 2015లో ఈశాన్య అమెరికాలో జీపీఎస్ వ్య‌వ‌స్థ‌కు ఇబ్బంది క‌లిగించాయి. అదే 1989లో కెన‌డాలోని క్యూబెక్ మీదుగా వెళ్లిన ఓ సౌర తుఫాను అక్క‌డి విద్యుత్ వ్య‌వ‌స్థ‌కు 9 గంట‌ల పాటు అంత‌రాయం క‌లిగించిందని నిపుణులు వెల్లడించారు.

జియోమాగ్నెటిక్ తుఫాను అంటే ?..
భూ అయస్కాంత తుఫాను అనేది.. భూమి అయస్కాంతగోళానికి తీవ్ర అంతరాయం. సౌర గాలి తరంగాల నుంచి భూమికి చుట్టుపక్కల ఉన్న అంతరిక్ష వాతావరణంలోకి దూసుకొస్తుంది. National Oceanic and Atmospheric Administration (NOAA) ప్రకారం.. తుఫాను సౌర గాలుల ద్వారా ఉత్పత్తి అవుతుంది. భూ అయస్కాంత తుఫాను ఏర్పడాలంటే సౌర గాలి ఎక్కువ కాలం అధిక వేగంతో ఉండాలి. అప్పుడే సౌర గాలి భూమి అయస్కాంత క్షేత్రంలోకి దూసుకురాగలదు. అలా భూమి వైపు దూసుకొచ్చిన భారీ సౌరతుఫాను భూమివైపు క‌మ్యూనికేష‌న్ వ్య‌వ‌స్థ‌పై ప్ర‌భావం ప‌డ‌నుంద‌న్న వార్త‌లు కూడా విన్నాం. అయితే ఆ తుఫాను భూ అయాస్కాంత క్షేత్రంపై మాత్రం కాస్త ప్ర‌భావం చూపిన‌ట్లు ఎన్ఓఏఏ తెలిపింది.