ఇంగ్లాండ్‌లో కొడుకు మృతి.. పూణెలో చిక్కుకుపోయిన పేరెంట్స్

ఇంగ్లాండ్‌లో కొడుకు మృతి.. పూణెలో చిక్కుకుపోయిన పేరెంట్స్

ఇంగ్లాండ్‌లోని ఉల్కన్‌లో సిద్దార్థ్ ముర్కుంబీ(23) మార్కెటింగ్ కోర్సు చేస్తున్నాడు. మార్చి 15నుంచి అతని ఆచూకీ తెలియడం లేదని పేరెంట్స్ కంప్లైంట్ చేశారు. ఇటీవల నది ఒడ్డున అతని మృతదేహం కనిపించడంతో పేరెంట్స్ కు సమాచారం ఇచ్చారు. పూణెలో ఇరుక్కున్న వారికి అక్కడికి ఎలా వెళ్లాలో తెలియక ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. 

సిద్ధార్థ్ తండ్రి శంకర్ ముర్కుంబీ యూకే ప్రభుత్వానికి తన కొడుకు మృతదేహాన్ని ఇండియాకు పంపాలని అంత్యక్రియలు నిర్వహించుకుంటామని విజ్ఞప్తి చేస్తున్నాడు. అతని తల్లి చివరిసారిగా హత్తుకునే అవకాశాన్ని కల్పించాలని మొరపెట్టుకుంటున్నాడు. కరోనావైరస్ కారణంగా ఎయిర్ లైన్స్ మొత్తం నిషేదించడంతో పేరెంట్స్ కు అక్కడికి వెళ్లలేని పరిస్థితి. ఒకవేళ వెళ్లినా తిరిగి రాలేరు.

సిద్దార్థ్ ఆత్మహత్మకు పాల్పడినట్లుగా అక్కడి పోలీసులు భావిస్తున్నారు. రెండ్రోజులు ముందు యూనివర్సిటీలో అతణ్ని కలిసిన సీనియర్ శివమ్ మాట్లాడుతూ.. ఆత్మహత్య చేసుకునేలా కనిపించలేదని చెప్పాడు. రిబల్ నదికి ఉత్తరంవైపుగా ఉన్న ప్రీస్టన్ సిటీలోని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అక్కడి మీడియా వర్గాలు పేర్కొన్నాయి. 

రిబల్ నది పక్కన మృతదేహం దొరికిన వెంటనే రాయల్ ప్రీస్టన్ హాస్పిటల్ మార్చురీకి బాడీని తరలించారు. అంత్యక్రియలు తాము పూర్తి చేసుకుంటామని విన్నవించుకోవడానికి సెప్టెంబర్ వరకూ అన్ని న్యాయవిచారణలను క్లోజ్ చేసింది గవర్నమెంట్. అంత్యక్రియలు పూర్తి చేయడానికి కుటుంబం అటెండ్ కాలేకపోతే సంబంధీకుల నుంచి సంతకాలు తీసుకుని పేపర్ వర్క్ పూర్తి చేసి మృతదేహాన్ని విడిచిపెడతారు. సిద్దార్థ్ కుటుంబం అక్కడికి రాలేమని స్వదేశానికి మృతదేహాన్ని పంపాలని కోరుకుంటుంది. (రెడ్‌ జోన్ల వారీగా కరోనా పరీక్షలు)