ఓరి ద్యావుడా : చచ్చిన ఎలుకలతో వైన్, గబ్బిలాల సూప్

10TV Telugu News

గబ్బిలాలతో చేసిన సూప్..చచ్చిపోయిన ఎలుకలతో వైన్..ఇదే  ఆ ప్రాంతంలో ఆహారం. ఏంటి చూడటం కాదు వింటేనే వాంతులు వచ్చే ఫీలింగ్ కలుగుతోంది కదూ..కానీ అక్కడ ఆహారం అదేనంటే నమ్ముతారా.. ఇటువంటి ఫుడ్ కూడా ఉంటుందా అనిపిస్తోందా..ఎక్కడ అనేదే కదా మీకు వచ్చే నెక్ట్స్ డౌట్..స్వీడన్‌లోని ‘డిస్గస్టింగ్ ఫుడ్ మ్యూజియం’. ఫుడ్ స్పెషల్. 

ప్రపంచంలో ఎన్నో ప్రాంతాలు..ఎన్నెన్నో ఆహారపు అలవాట్లు..ఆయా ప్రాంతాలకు ఇష్టమైన..సంప్రదాయ..అక్కడ లభించే వనరులను బట్టి  ఆ ప్రాంతాలను బట్టి..వాతావరణ పరిస్థితులను బట్టి ఆహారపు అలవాట్లు ఉంటుంటాయి.  కానీ ‘డిస్గస్టింగ్ ఫుడ్ మ్యూజియం’ లో ఉండే ఫుడ్ అన్నింటికీ ఫుల్ డిఫరెంట్. ఏవగింపు కలిగించే ఇటువంటి ఫుడ్ తయారు చేయటం ఈ మ్యూజియం ప్రత్యేకత. మరి ఆ ఫుడ్ ఐటెమ్స్ ఏంటో తెలుసుకుందాం..
Read Also : 600 కుక్కలు ఆత్మహత్య : మిస్టరీ వంతెన

‘డిస్గస్టింగ్ ఫుడ్ మ్యూజియం’ 400 చదరపు మీటర్లు విస్తరించి ఉంటుంది. ఈ మ్యూజియంలో మనుషులు (ఏప్రాంతంలోని వారైనా) తినే ఆహారం ఎక్కడా కనిపించదు. అందమైన కుందేలు తలతో చేసిన మాంసం..పాచిపోయి కంపుగొట్టే సోయాబీన్స్..చచ్చిపోయిన ఎలుకతో చేసిన వైన్..సంవత్సరాల తరబడి నిలువ ఉంచిన గుడ్లు..మేక..గొర్రెల కండ్లతో చేసిన జ్యూస్..గబ్బిలంతో తయారు చేసిన సూప్..పురుగులు పట్టేసిన ఛీజ్..చచ్చి కుళ్లిపోయిన ముంగీసలు..తేళ్లు..పాములతో తయారు చేసిన 100 రకాల భయంకరమైన ఫుడ్..అండ్ జ్యూస్ లు ఈ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఈ భయానక ఆహారాన్ని సందర్శకులు ముట్టుకోవచ్చు, వాసన చూడొచ్చు, రుచి కూడా చూడొచ్చు.

ఈ మ్యూజియంలో అడుగు పెట్టిన సందర్శకులు వాంతులు చేసుకోకుండా బయటకు వెళ్లరట. అందుకని.. రోజూ ఎంతమంది సందర్శకులు వాంతులు చేసుకున్నారనే వివరాలను కూడా వారు నోటీసు బోర్డులో పెడతారట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. మ్యూజియం రోజూ తెరిచి ఉండదు. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే దీన్ని తెరుస్తారట.

ఇంతటి భయకరమైన ఫుడ్ ను ‘డిస్గస్టింగ్ ఫుడ్ మ్యూజియం’ నిర్వాహకులు  తయారుచేయటానికి కారణమేంటంటే..ప్రపంచంలో ప్రజల ఆహారపు అలవాట్లను మార్చడం కోసమే ఈ మ్యూజియంను ఏర్పాటు చేశామని నిర్వాహకులు చెబుతున్నారు. మా ఊళ్లో అన్నమే తింటాం..లేదా రొట్టెలే తింటాం..ఇక్కడ దొరకదా? మరెలా అనుకుంటాం మనం వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆయా ప్రాంతాలలో దొరికే ఫుడ్ నే తినాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రజల ఆహారపు అలవాట్లను మార్చేందుకు ఈ ‘డిస్గస్టింగ్ ఫుడ్ మ్యూజియం’ యాజమాన్యం వారు చెబుతున్నారు..మరి మీరుకూడా ఆ భయకర ఫుడ్ ను చూడాలన్నా..టేస్ట్ చూడాలనుకున్నా స్వీడన్ వెళ్లాల్సిందే. 

 

×