South Africa ‘Phala Phala farmgate’Scam : ‘తేలుకుట్టిన దొంగలా’ తయారైన దేశాధ్యక్షుడు పరిస్థితి..కుంభకోణంతో కూడబెట్టిన సొమ్మును దోచేసిన దొంగలు..

‘సొమ్ము పోయే శని పట్టే’,‘తేలుకుట్టిన దొంగ’ ఇటువంటి సామెతలు అన్ని ప్రత్యక్షంగా కళ్లకు కట్టాయి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసాకు. స్కామ్ కు పాల్పడి దోచుకున్న సొమ్ము అంతా దొంగలు పక్కా ప్లాన్ తో దోచుకుపోవటంతో సిరిల్ రామఫోసా పరిస్థితి తేలు కుట్టిన దొంగలా నోరు మూసుకోవాల్సి వచ్చింది. ఫలాఫలా ‘ఫామ్‌గేట్’ కుంభకోణం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న క్రమంలో సిరిల్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ స్కామ్ లో దోచిన డబ్బును రహస్యంగా దాచిపెట్టగా ఆ సొమ్మును దొంగలు దోచుకుపాయారు. దీంతో ‘తేలుకుట్టిన దొంగలా’ ఉందామని ఆయన ఎంతగా తంటాలు పడినా విషయం కాస్తా బట్టబయలు అయ్యింది. దీంతో ఆయన అధ్యక్షపదవికే ఎసరు తెచ్చిపెట్టింది. ఉన్న పదవికాస్తా ఊడే పరిస్థితి వచ్చింది.

South Africa ‘Phala Phala farmgate’Scam : ‘తేలుకుట్టిన దొంగలా’ తయారైన దేశాధ్యక్షుడు పరిస్థితి..కుంభకోణంతో కూడబెట్టిన సొమ్మును దోచేసిన దొంగలు..

South Africa President Ramaphosa Phala Phala ‘Farmgate’ Scam

South Africa President Ramaphosa Phala Phala ‘Farmgate’ Scam: ‘సొమ్ము పోయే శని పట్టే’,‘తేలుకుట్టిన దొంగ’ ఇటువంటి సామెతలు అన్ని ప్రత్యక్షంగా కళ్లకు కట్టాయి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసాకు. స్కామ్ కు పాల్పడి దోచుకున్న సొమ్ము అంతా దొంగలు పక్కా ప్లాన్ తో దోచుకుపోవటంతో సిరిల్ రామఫోసా పరిస్థితి తేలు కుట్టిన దొంగలా నోరు మూసుకోవాల్సి వచ్చింది. ఫలాఫలా ‘ఫామ్‌గేట్’ కుంభకోణం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న క్రమంలో సిరిల్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ స్కామ్ లో దోచిన డబ్బును రహస్యంగా దాచిపెట్టగా ఆ సొమ్మును దొంగలు దోచుకుపాయారు. దీంతో ‘తేలుకుట్టిన దొంగలా’ ఉందామని ఆయన ఎంతగా తంటాలు పడినా విషయం కాస్తా బట్టబయలు అయ్యింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన అధ్యక్షపదవికే ఎసరు తెచ్చిపెట్టింది. ఉన్న పదవికాస్తా ఊడే పరిస్థితి వచ్చింది.

కాగా దక్షిణాఫ్రికా రాజకీయాల్లో ఫలాఫలా ‘ఫామ్‌గేట్’ కుంభకోణం అల్లకల్లోలం సృష్టిస్తోంది. అవినీతిని నిర్మూలిస్తానంటూ ఎన్నికల్లో ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన సిరిల్ రామఫోసా భారీ అవినీతికి పాల్పడ్డారు. అలా దోచిన సొమ్మును ఆయన తన వ్యవసాయ క్షేత్రంలో దాచిపెట్టారు. ఈ సొమ్ముపై అక్కడే పనిచేసే ఓ హౌస్ కీపర్ కన్ను పడింది. ఇంకేముంది ఆ హౌస్‌కీపర్‌ తన సోదరుడికి చెప్పటం..అతడికి తెలిసిన ఓ క్రిమినల్‌ గ్యాంగ్‌ రంగంలోకి దింపటం ఆ డబ్బుని దోచేయటంతో అధ్యక్షుడి గుట్టు రట్టు అయ్యింది. అటు దొంగతనం జరిగిందని చెప్పుకోలేడు..ఇటు తనపై వచ్చిన ఆరోపణలను ఎదుర్కోని పరిస్థితి ఏర్పడింది ఈ సొమ్ము దోపిడీకి గురికావటంతో..అంతేకాదు ఇక్కడ మరో గమనించాల్సిన విషయం ఏమిటంటే..దోచుకున్న సొమ్ము కొట్టేసిన దొంగలకు సదరు అధ్యక్షులవారు నిందితులు ఈ విషయాలు ఎక్కడా చెప్పకుండా ఉండటానికి ఎదురు డబ్బు కూడా చెల్లించటం..!!

పోయిన డబ్బేదో పోయిందని ఊరుకోకుండా నేలకు పోయినదాన్ని నెత్తిన పెట్టుకున్నటైంది సదరు అధ్యక్షులవారి పరిస్థితి. దొంగల నోరు మూయించడానికి ఎదురు చెల్లింపులు చేశారంటే ఆయన పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కాగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసాపై ఆరోపణలు చేసింది ఎవరో సాధారణ వ్యక్తి అయితే ఇంత జరిగేది కాదేమో. సిరిల్ పై ఆరోపణలు చేసింది సాక్షాత్తు సౌతాఫ్రికన్‌ స్టేట్‌ సెక్యూరిటీ ఏజెన్సీ మాజీ అధిపతి ఆర్థర్‌ ఫ్రాసెర్‌. 2020 ఫిబ్రవరి9న దక్షిణాఫ్రికాలోని లింపూపూ ప్రావిన్స్‌లోని రామఫోసాకు ఫలాఫలా వైల్డ్‌లైఫ్‌ ఫామ్‌ ఉంది. దాంట్లోని ఫర్నీచర్‌లో భారీ మొత్తంలో డాలర్లను దాచిపెట్టారు. ఈ విషయం అక్కడే పనిచేసే హౌస్‌కీపర్‌ గుర్తించి అతని సోదరుడికి విషయం చెప్పటంతో దొంగ సొమ్ము దోపిడీకి ప్లాన్ బీజం పడింది.

అధ్యక్షుడు రామఫోసా విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ప్లాన్ వర్కౌంట్ చేయటానికి హౌస్ కీపర్ సోదరుడికి తెలిసిన ఆరుగురు సభ్యుల క్రిమినల్‌ గ్యాంగ్‌ రంగంలోకి దిగింది. వీరిలో నలుగురు నమీబియా వాసులు. వీరు ఫామ్‌హౌస్‌లోకి రావడానికి హౌస్‌కీపర్‌ చక్కగా సహకరించటంతో సొమ్మును దోచుకున్న సదరు గ్యాంగ్ పని కూల్ గా చక్కబెట్టుకుని బయటపడింది. పర్యటన ముగిసాక తన కొంప కొల్లేరైందని గుర్తించిన రామఫోసా దిమ్మ తిరిగిపోయింది. దీంతో దోచిన సొమ్ము విషయం బయటపడకుండా తప్పుమీద తప్పు చేసుకుంటూ పోయారు. దొంగతనం విషయం తెలియగానే ప్రెసిడెన్షియల్‌ ప్రొటెక్షన్‌ పోలీస్‌ యూనిట్‌ను నిందితులను పట్టుకోవాలని పురమాయించారు. కానీ సంబంధిత శాఖ వద్ద ఎటువంటి కేసు పెట్టలేదు.

ప్రెసిడెన్షియల్‌ ప్రొటెక్షన్‌ పోలీస్‌ యూనిట్‌ అధిపతి మేజర్‌ జనరల్‌ వాలీ రుడ్‌ మాత్రం రిటైర్డ్‌ పోలీసులు, క్రైం ఇంటెలిజెన్స్‌ యూనిట్‌లోని పోలీసులతో కలిపి బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈబృందం హౌస్‌ కీపర్ తో పాటు అతడికి సహకరించిన వారిని పట్టుకొని కొంతవరకు సొమ్ము రికవరీ చేశారు. నిందితులు ఈ విషయాలు ఎక్కడా చెప్పకుండా ఉండటానికి ఎదురు డబ్బు ఇచ్చారు. 2022 జూన్‌ 1న అధ్యక్షుడు రామఫోసాపై కిడ్నాప్‌, లంచాలు, మనీలాండరింగ్‌, సుమారు 4 మిలియన్‌ డాలర్లకు సంబంధించి నేరాలను దాచడం వంటి ఆరోపణలు చేస్తూ సౌతాఫ్రికన్‌ స్టేట్‌ సెక్యూరిటి ఏజెన్సీ మాజీ అధిపతి ఆర్థర్‌ ఫ్రాసెర్ జొహన్నెస్‌బర్గ్‌ పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆ దేశంలోని ప్రివెన్షన్‌ అండ్‌ కాంబాట్‌ కరెప్ట్‌ యాక్టివిటీస్‌ చట్టం కింద ఈ ఆరోపణలు కేసు నమోదయ్యాయి. దీనికి సంబంధించిన కీలక ఆధారాలు కూడా సమర్పించారు. దొంగతనంలో పోయిన సొమ్ము అక్రమ సంపాదన అనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అలా ఈ స్కామ్ ఫాలా ఫాలా ‘ఫామ్‌గేట్‌’ కుంభకోణంగా పాపులర్‌ అయింది..!!

దీంతో అధ్యక్షుడు ప్రతినిధి జూన్‌2వ తేదీన ఫాలాఫాలా ఫామ్‌లో దొంగతనం జరిగిందని అంగీకరించాల్సిన పరిస్థతి వచ్చింది. ప్రెసిడెన్షియల్‌ ప్రొటెక్షన్‌ యూనిట్‌కు ఫిర్యాదు చేసిన విషయాన్ని కూడా ధ్రువీకరన జరిగింది. రించారు. ఇక ఎటూ తప్పించుకోవటానికి లేకుండాపోయింది. ఈక్రమంలో అధ్యక్షుడు రామఫోసాపై దర్యాప్తు షూరూ అయ్యింది. ఒక్కొక్కటి బయటపడటం మొదలైంది. మరోవైపు రామఫోసా ఆ డబ్బు ఎలా వచ్చిందో మాత్రం నోరు విప్పి చెప్పటంలేదు. దర్యాప్తు సంస్థ విచారణలో మాత్రం ‘పశువుల విక్రయాలతో సంపాదించిన సొమ్ము’ అని మాత్రమే చెప్పారు రామఫోసా.

ఆ దేశ రిటైర్డ్‌ చీఫ్‌ జస్టిస్‌ శాండిల్‌ నగ్‌కోబో ఆధ్వర్యంలోని దర్యాప్తు ప్యానెల్‌ బుధవారం (నవంబర్ 30,2022)తన నివేదికను రామఫోసాను తప్పుబడుతూ నేషనల్‌ అసెంబ్లీ స్పీకర్‌కు అందజేసింది. దీంతో ఆయనను అభిశంసించడానికి ఇది పెద్ద ఆయుధంగా మారింది. దక్షిణాఫ్రికాలో ఎటువంటి అనుమతి లేకుండా భారీ మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని వ్యక్తుల వద్ద నిల్వచేయడం నేరంగా పరిగణించబడుతుంది. అన్ని రకాలుగా రామఫోసా ఇరుక్కుపోవటంతో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఎందుకంటే రామఫోసా పదవి నుంచి తొలగించే బలం ప్రతిపక్షాలకు లేదు మరి.

ఆర్థర్‌ ఫ్రాసెర్‌ దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్‌ జుమాకు నమ్మినబంటుగా పేరుంది. జాకబ్‌ జుమాపై అవినీతి ఆరోపణలు రావడంతో రామఫోసాకు దేశాధ్యక్ష పదవి దక్కింది. అవినీతిని నిర్మూలిస్తానంటూ రామఫోసా ఎన్నికలకు వెళ్లటం..ఆయనను విజయం వరించటంతో అధ్యక్షుడయ్యారు. కాగా.. రాజకీయ శతృత్వంతో ఆర్థర్‌ ఫ్రాసెర్‌ ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా దక్షిణాఫ్రికాకు 2024లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సమయంలో ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ తరపున అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకోవడానికి దాదాపు నెలరోజుల ముందు ఈ కుంభకోణం సౌతాఫ్రికాను కుదిపేస్తోంది.