రైలులో ప్రయాణించిన సౌతాఫ్రికా అధ్యక్షుడు…చెడుగుడాడేసిన నెటిజన్లు

  • Published By: venkaiahnaidu ,Published On : March 21, 2019 / 11:52 AM IST
రైలులో ప్రయాణించిన సౌతాఫ్రికా అధ్యక్షుడు…చెడుగుడాడేసిన నెటిజన్లు

ఎన్నికలు వస్తే చాలు అనకాపల్లిలో అయినా,ఆఫ్రికాలో అయినా రాజకీయనాయకులు ఒకేలా ఉంటారు.ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు నానారకాల ప్రయత్నాలు చేస్తుంటారు.అధికారంలో ఉన్నన్ని రోజులు గుర్తుకురాని సమస్యలు నాయకులకు అప్పడే గుర్తుకువస్తాయి.అయ్యో ..పాపం ప్రజలు ఇన్ని కష్టాలు పడుతున్నారా అని ఏమీ తెలియని వ్యక్తుల్లా భలే డ్రామలాడతారు.మనదేశంలోనే ఇలాంటి రాజకీయాలు జరుగుతాయనుకుంటే పొరపాటే. 

మనదేశంలోలానే సౌతాఫ్రికాలో కూడా ఇప్పుడు ఎన్నికల సీజప్ మొదలైంది.మే నెలలో అక్కడ ఎన్నికలు జరుగనున్నాయి.ఈ సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు నాయకులు నానా రకాలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో ఆ దేశ అధ్యక్షుడు సిరిల్‌ రామఫొసా ఇప్పట్నుంచే తన ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రచారంలో భాగంగా సోమవారం(మార్చి-18,2019) మబోపనే నుంచి పరిపాలనా రాజధాని ప్రిటోరియాకు సాధారణ ప్రయాణికులతో కలసి ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు.
Read Also : చిత్తుకాగితాలు కాదురా అవి : పాకిస్తాన్ ప్రింటింగ్ ప్రెస్ ల్లో భారత నోట్ల ముద్రణ

అయితే మనదేశంలోలానే దక్షిణాఫ్రికాలో కూడా రైళ్లు ఆలస్యంగా రావడమనేది సర్వసాధారణమైన విషయం.అధ్యక్షుడు ఉన్నాడని రైలు వేగంగా రాదు కదా. ఎప్పటిలానే అక్కడికి రావాల్సిన రైలు గంటసేపు ఆలస్యంగా వచ్చింది.దీంతో గంటసేపు ఆయన రైల్వే స్టేషన్ లో రైలు ఎప్పుడొస్తుందా అని సాధారణ ప్రజలలాగా ఎదురుచూడాల్సి వచ్చింది.

గంట ఆలస్యంగా వచ్చిన రైలు… 45నిమిషాల్లో చేరుకోవాల్సిన గమ్యస్థానం ప్రిటోరియా స్టేషన్ కు వెళ్లడానికి 3గంటల సమయం పట్టింది. ప్రయాణ సమయంలో మార్గమధ్యంలో అనుకోకుండా చాలాసేపు రైలు ఆగిపోయింది. ఆ సమయంలో కిటికీలో నుంచి తల బయటకు పెట్టి తోటి ప్రయాణికులతో రామఫొసా ముచ్చటిస్తున్నసమయంలో ఆయనతో ఉన్న విలేకరులు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ గా మారాయి. ప్రయాణికులతో అధ్యక్షుడు రామఫొసా ఉన్న ఫొటోలపై అక్కడి సామాజిక కార్యకర్తలు,సామాన్య ప్రజలు సోషల్‌ మీడియాలో విమర్శల దాడికి దిగారు. రామఫొసా ఆధ్వర్యంలో నడుస్తున్న ఆఫ్రికా నేషనల్‌ కాంగ్రెస్‌ (ANC) ప్రభుత్వానికి సిగ్గులేదని, ఘోరంగా ఉన్న రైల్వే వ్యవస్థ ప్రాసా (ప్యాసింజర్‌ రైల్‌ ఏజెన్సీ ఆఫ్‌ సౌతాఫ్రికా) సర్వీసుల గురించి ప్రజలు గగ్గోలు పెడుతున్నా సిరిల్‌ సర్కార్‌ పట్టించుకోవట్లేదని ట్వీట్లతో విరుచుకుపడ్డారు.

ప్రిటోరియా చేరుకున్న అధ్యక్షుడు రామఫొసా అక్కడి రైల్వే అధికారులను కలసి ఇది జాతీయ సమస్యగా మారిందని, దీన్ని వీలైనంత త్వరగా పరిష్యరించాలని ఆదేశించారు. రైళ్లో 50 కి.మీ దూరాన్ని చేరుకోవడానికి తమకు 3 గంటల సమయం పట్టింది. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్యరించేలా ప్రాసాతో చర్చలు జరుపుతున్నామని అధ్యక్షుడు సిరిల్ రామఫొసా అన్నారు. 400 సీట్లున్న సౌతా​ఫ్రికా పార్లమెంట్‌లో సమారు 60 శాతం ఓట్లను గెలుచుకునే దిశగా ANC వ్యూహాలు రచిస్తోంది.2018లో అధ్యక్షుడుగా ఉన్న జాకోబ్ బుబా అవినీతి బాగోతం బయటపడటంతో అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు,దీంతో ఆయన స్థానంలో  సిరిల్ రామఫొసా సౌతాఫ్రికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

Read Also : తేడా వస్తే జైలుకే : సోషల్ మీడియా ప్రచారానికి ఈసీ బ్రేక్