Guinness Record : గంటలో 249 టీ తయారు చేసి గిన్నిస్ రికార్డు సాధించిన మహిళ

ఒకే ఒక్క గంటలో 10..20 కాదు ఏకంగా 249 టీలు తయారు చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించింది ఓ మహిళ.

Guinness Record : గంటలో 249 టీ తయారు చేసి గిన్నిస్ రికార్డు సాధించిన మహిళ

woman makes 249 cups of tea in one hour to set Guinness World record

Guinness Record : ఏమే..ఓ టీ పట్రా అని భర్త ఆర్డర్ వేస్తే..ఆ భార్య టీ తయారు చేసి తీసుకురావటానికి కనీసం 15 నిమిషాలన్నా పడుతుంది. టీ పెట్టటంలో సిద్ధహస్తులైనవారు కూడా ఒక టీ తయారు చేయటానికి కనీసం 10నిమిషాలన్నా తీసుకుంటారు. కానీ ఓ మహిళ మాత్రం ఒకే ఒక్క గంటలో 10..20 కాదు ఏకంగా 249 టీలు తయారు చేసింది. మరీ ఆమె ప్రతిభకు పట్టం కట్టాలి కదా..అందుకే గిన్నీస్ వరల్డ్ రికార్డు వారు అవార్డు ఇచ్చేశారు. వావ్ ఏమీ టీలు తయారు చేసే సామర్థ్యం అంటూ కితాబు కూడా ఇచ్చేశారు.

ఒక్క గంటలో 249 టీలు తయారు చేసిన గిన్నీస్ రికార్డు సాధించిన ఆమె సౌతాఫ్రికాకు చెందిన ఇంగర్ వాలెంటైన్. ఇంగర్ మూడు ఫ్లేవర్లలో రూయిబోస్ టీ తయారు చేసింది. ఇది ఒక హెర్బల్ టీ. ఈ టీలో వెనీలా ఫ్లేవర్, స్ట్రాబెర్రీ ఫ్లేవర్లలో అత్యద్భుతమై రుచి కలిగిన టీలు తయారు చేసింది. రికార్డు సాధించడానికి కనీసం 150 టీలు తయారు చేయాల్సి ఉండగా.. పక్కా ప్లాన్ తో ఏకంగా 249 టీలు తయారు చేసి రికార్డు సృష్టించింది.

మామూలుగా ఈ టీ తయారు చేయాలంటే.. టీ బ్యాగులను కనీసం 2 నిమిషాలపాటు కప్పులో నానబెట్టాలి. తరువాత డిప్ చేయాలి. అప్పుడే టీకి చక్కటి రంగు..రుచీ వస్తుంది. కానీ ఇంగర్ మాత్రం తన చేతిని మిషన్ కంటే వేగంగా తిప్పుతు పక్కా ప్లాన్ తో గంటలో ఏకంగా 249 టీలు తయారు చేసి గిన్నీస్ రికార్డు సాధించేసింది.

పక్కా స్ట్రాటజీతో ఇంగర్ మూడు టీలు తయారు చేసి టీ బ్యాగులు వాటిలో వేయగానే మరో బ్యాచ్ తయారు చేయడంలో తన సామర్థ్యాన్ని చూపించింది. అలా చకచకా టీలు తయారు చేసి గంట ముగిసే సరికి 249 కప్పుల టీతో రికార్డులు బద్దలు కొట్టింది. ఆమె చేసిన టీ వేస్ట్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్న గిన్నిస్ బుక్ ప్రతినిధులు.. స్థానికులను ఆహ్వానించి, వారికి ఈ టీలు అందజేసింది.