ఈ 12ఏళ్ల కుర్రాడు ఫ్యూచర్ వారెన్ బఫెట్.. స్టాక్స్‌లో 16లక్షలు ఇన్వెస్ట్, ఏడాదిలోనే 43శాతం ప్రాఫిట్స్

ఈ 12ఏళ్ల కుర్రాడు ఫ్యూచర్ వారెన్ బఫెట్.. స్టాక్స్‌లో 16లక్షలు ఇన్వెస్ట్, ఏడాదిలోనే 43శాతం ప్రాఫిట్స్

South Korean boy may be Warren Buffett: పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెత ఈ కుర్రాడికి కరెక్ట్ గా సరిపోతుంది. స్నేహితులతో ఆడుకునే వయసులో అద్భుతాలు సృష్టించాడు. జస్ట్ 12ఏళ్ల వయసులోనే యావత్ దేశం దృష్టిని అట్రాక్ట్ చేశాడు. మేధావులకు సైతం అంతుచిక్కని స్టాక్ మార్కెట్ లో వండర్ క్రియేట్ చేశాడు.

సౌత్ కొరియాకి చెందిన 12ఏళ్ల కుర్రాడు క్వాన్ జూన్(kwon joon).. స్టాక్ మార్కెట్ లో సూపర్ ట్రేడర్ గా నిలిచాడు. దీనికి కారణం ఏడాది వ్యవధిలోనే 43శాతం ప్రాఫిట్స్ సాధించడమే. గత ఏడాది(2020) ఏప్రిల్ లో క్వాన్ తన తల్లి సాయంతో ట్రేడింగ్ అకౌంట్ తీసుకున్నాడు. ఆ తర్వాత పేరెంట్స్ నుంచి రూ.16లక్షలు అడిగి తీసుకుని స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశాడు. ఏడాది తిరక్కుండానే 43శాతం ప్రాఫిట్స్ వచ్చాయి. దీంతో కొరియాలో ఈ బుల్లి ఇన్వెస్టర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. కోకాకోలా, శాంసంగ్ షేర్లను క్వాన్ కొన్నాడు.

ప్రస్తుతం ఈ బాలుడిని అందరూ.. అపర కుబేరుడు వారెన్ బఫెట్ తో పోలుస్తున్నారు. నెక్ట్స్ వారెన్ బఫెట్ నువ్వే అంటున్నారు. వారెన్ బఫెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ఇన్వెస్టర్. పెట్టుబడులు పెట్టడంలో వ్యూహకర్త.

Kwon Joon plays with his younger sister in Jeju, South Korea, February 8, 2021. (Image: Lee Eun-Joo)

నా రోల్ మోడల్ వారెన్ బఫెట్ అని క్వాన్ జూన్ చెప్పడం విశేషం. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ తో పోలిస్తే, సుదీర్ఘ కాలం అంటే 10 నుంచి 20ఏళ్లు పెట్టుబడులు చేస్తే రిటర్న్స్ బాగా వచ్చే అవకాశం ఉందని క్వాన్ చెప్పాడు. ”ఆ రోజు స్టాక్ మార్కెట్ నిపుణుడు టీవీలో చెప్పడం నేను విన్నాను. పదేళ్లకు ఒకసారి ఇలాంటి అవకాశం వస్తుందని ఆయన చెప్పాడు. దీని గురించి నేను మా తల్లిదండ్రులతో మాట్లాడాను. వెంటనే రూ.16లక్షలు స్టాక్స్ లో పెట్టాను” అని క్వాన్ చెప్పాడు. కాగా, కొరియాలో రిటైల్ ఇన్వెస్టర్స్ లో ఎక్కువశాతం మంది టీనేజర్లు లేదా అంతకన్నా చిన్నవాళ్లే ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి.

ఏడాదిలోనే 43శాతం ప్రాఫిట్స్ రావడం పట్ల క్వాన్ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ వయసులో నా కొడుకు ఇది సాధించాడంటే నమ్మబుద్ధి కావడం లేదని క్వాన్ తల్లి అంది. ఆమె తన కొడుకుని ట్యూషన్స్ లో ఎక్కువ సేపు గడవడం కన్నా బిజినెస్ గురించి ఎక్కువ వివరాలు తెలిసేలా చేసింది.