Air Force Chief Resigns : ఉద్యోగి ఆత్మహత్యతో ఎయిర్ ఫోర్స్ చీఫ్ రాజీనామా

దక్షిణ కొరియా ఎయిర్‌ ఫోర్స్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ జనరల్‌ లీ సియాంగ్‌-యాంగ్‌ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు.

Air Force Chief Resigns : ఉద్యోగి ఆత్మహత్యతో ఎయిర్ ఫోర్స్ చీఫ్ రాజీనామా

Air Force Chief Resigns

Air Force Chief Resigns దక్షిణ కొరియా ఎయిర్‌ ఫోర్స్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ జనరల్‌ లీ సియాంగ్‌-యాంగ్‌ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. సహోద్యోగి లైంగిక వేధింపుల కారణంగా ఇటీవల ఓ మహిళా ఎయిర్‌ ఫోర్స్‌ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ప్రజాగ్రహం వెల్లువెత్తింది. దీంతో ఉద్యోగి మరణానికి బాధ్యత వహిస్తూ జనరల్‌ లీ సియాంగ్‌-యాంగ్‌ తన పదవికి రాజీనామా చేశారు.

ప్రజలకు నేను క్షమాపణలు చెబుతున్నాను. బాధితురాలికి మరియు ఆమె కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. నేను ఎక్కువ బాధ్యతగా ఫీల్ అవుతూ నా పదవికి రాజీనామా చేస్తున్నా అని జనరల్ లీ ఓ ప్రకటనలో తెలిపారు. జనరల్‌ లీ రాజీనామాను తక్షణమే దేశ అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ ఆమోదించారు. దీంతో తక్కువ కాలం దక్షిణ కొరియా ఎయిర్ ఫోర్స్ చీఫ్ గా పనిచేసిన వ్యక్తిగా జనరల్ లీ నిలిచారని ప్రెసిడెంట్ ప్రెస్ సెక్రటరీ తెలిపారు. గతేడాది నవంబర్ లో జనరల్ లీ దక్షిణ కొరియా ఎయిర్ ఫోర్స్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు.

కాగా, బాధిత మహిళపై లైంగిక వేధింపులు,గాయపర్చడం వంటి ఆరోపణలపై ఓ ఎయిర్‌ ఫోర్స్‌ మాస్టర్‌ సార్జంట్‌ను గురువారం రక్షణశాఖ అధికారులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. మార్చి నెలలో సదరు నిందితుడు కారులో బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. అయితే, ఉన్నతాధికారులు ఈ సంఘటనను బయటకు రాకుండా చూడ్డానికి ప్రయత్నించారని, నిందితుడితో ప్రైవేటు సెటిల్‌మెంట్‌ చేసుకోవాలంటూ రెండు నెలల పాటు బాధితురాలపై ఒత్తిడి తెచ్చారని బాధితురాలి కుటుంబం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఆమె మానసిక బాధను అనుభవిస్తూ మే నెలలో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

ఈ కేసుపై తోతైన దర్యాప్తు చేయించాలని..తమ కూతురిని వేధించినవారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ మంగళవారం బాధితురాలి కుటుంబసభ్యులు ప్రెసిడెన్షియల్‌ ఆఫీసుకి ఓ పిటిషన్‌ను దాఖలు చేసింది. కేసును తుడిచిపెట్టడానికి ప్రయత్నించిన ఉన్నతాధికారులకు శిక్ష విధించాలంటూ 326,000మందికి పైగా మంది ఆ పిటిషన్‌పై సంతకం చేశారు. దీనిపై ప్రెసిడెంట్‌ మూన్‌ స్పందిస్తూ.. గురువారం విచారణకు ఆదేశించారు. ఎయిర్ ఫోర్స్ ఈ కేసుని ఎలా హ్యాండిల్ చేసిందన్న విషయంపై కూడా విచారణకు అధ్యక్షుడు ఆదేశించారు.