మెట్రో ట్రైన్‌లో షాకింగ్ ఘటన.. మాస్క్ ధరించాలని చెప్పినందుకు తోటి ప్రయాణికులను చెప్పుతో కొట్టాడు, మీద పడి కుమ్మేశాడు

  • Published By: naveen ,Published On : September 2, 2020 / 09:05 AM IST
మెట్రో ట్రైన్‌లో షాకింగ్ ఘటన.. మాస్క్ ధరించాలని చెప్పినందుకు తోటి ప్రయాణికులను చెప్పుతో కొట్టాడు, మీద పడి కుమ్మేశాడు

ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. కరోనాను అంతం చేసే వ్యాక్సిన్ కానీ, నయం చేసే మందు కానీ ఇంకా ఏవీ రాలేదు. దీంతో కోవిడ్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ముందు జాగ్రత్తలు చాలా అవసరం. అందులో భాగమే మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం. కరోనా బారిన పడకుండా ఉండాలంటే ప్రస్తుతం ఇవి రెండే మార్గాలు. అయితే కొందరు వ్యక్తులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మాస్కులు పెట్టుకోవడం లేదు, భౌతికదూరం పాటించడం లేదు. పైగా, మాస్కు పెట్టుకోవాలని చెబితే దురుసుగా ప్రవర్తిస్తున్నారు. కొంతమంది కోపంతో దాడి కూడా చేస్తున్నారు.

మాస్కు పెట్టుకోవాలని చెప్పినందుకు చెప్పుతో దాడి:
సౌత్ కొరియా రాజధాని సియోల్ లో అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. మెట్రో ట్రైన్ లో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. అతడు మాస్కు పెట్టుకోలేదు. దీంతో తోటి ప్రయాణికులు, మాస్కు పెట్టుకోవాలని అతడికి చెప్పారు. అలా చెప్పడమే వారి పాలిట శాపమైంది. అంతే, ఆ వ్యక్తి కోపంతో ఊగిపోయాడు. బూతులు తిట్టడం స్టార్ట్ చేశాడు. అంతటితో ఆగలేదు, తన చెప్పుతో వారిని కొట్టాడు. ఆ తర్వాత వారి మీద పడి కుమ్మాడు. ఈ ఘటనతో బోగిలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఆ వ్యక్తి చర్యలకు బిత్తరపోయారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.

నాకు చెప్పడానికి నువ్వెవరు అంటూ దాడి:
సియోల్ లో మెట్రో ట్రైన్ లో జరిగిన ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పబ్లిక్ ప్లేసుల్లో ఇండోర్ లో, ఔట్ డోర్ లో మాస్కులు ధరించడం మస్ట్ అని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇదే విషయాన్ని ప్రయాణికులు ఆ వ్యక్తికి చెప్పారు. మాస్కు పెట్టుకోవాలని, ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని కోరారు. నన్నే మాస్కు పెట్టుకోవాలని చెబుతారా? అంటూ ఆ వ్యక్తి గొడవకు దిగాడు. నాకు చెప్పడానికి మీరెవరు? అంటూ వారి మీద పడి దాడి చేశాడు.

భయాందోళనకు గురైన ప్రయాణికులు:
తొలుత ఓ ప్రయాణికుడిని ఆ వ్యక్తి చెప్పుతో కొట్టాడు. ఇంతలో మరో ప్రయాణికుడు స్పందించాడు. మాస్కు పెట్టుకోకపోవడం చట్టరిత్యా నేరం కదా అని ప్రశ్నించాడు. దీంతో ఆ వ్యక్తి మరింత రెచ్చిపోయాడు. నువ్వెవడు నాకు చెప్పడానికి అంటూ రెండో వ్యక్తితో గొడవపడ్డాడు. అతడిని కూడా చెప్పుతో కొట్టాడు. ఆ వ్యక్తి కూడా గట్టిగానే ప్రతిఘటించాడు. దీంతో ఇద్దరి మధ్య కాసేపు ఘర్షణ జరిగింది. తోటి ప్రయాణికులు ఆ వ్యక్తికి సర్ది చెబుతున్నా అతడు వినిపించుకోలేదు. ఘర్షణ పడుతూనే ఉన్నాడు. ఆ వ్యక్తి రియాక్షన్ తో బోగీలో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అతడి వయసు 50ఏళ్లు ఉంటుంది.

వాడసలు మనిషేనా:
కరోనా కేసులు ఎక్కువ కావడంతో స్థానిక ప్రభుత్వం మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇంటి నుంచి బయటకు వస్తే మాస్కు మస్ట్ అని చెప్పింది. నో మాస్క్, నో రైడ్ అనే రూల్ కూడా తెచ్చింది. పబ్లిక్ ట్రాన్స్ పోర్టులో ప్రయాణం చేయాలంటే మాస్కు మస్ట్ అని స్పష్టం చేసింది. అయినా కొందరు వ్యక్తులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రూల్స్ పాటించకపోగా పైగా రెచ్చిపోతున్నారు కూడా. తమ పట్ల అనుచితంగా వ్యవహరించిన ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేశారు. కాగా, ఇప్పుడీ వీడియో సెన్సేషనల్ గా మారింది. ఈ వీడియో చూసినోళ్లు షాక్ కి గురవుతున్నారు. వాడసలు మనిషేనా అని తిడుతున్నారు. తప్పుని సరిదిద్దుకోవాల్సింది పోయి సైకోలా రెచ్చిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.