Moon Jae-in: ప్రెసిడెంట్‌ కీలక నిర్ణయం..దేశంలో కుక్కల మాంసం తినటం నిషేధం

దక్షిణి కొరియా ప్రెసిడెంట్‌ మూన్‌ జే-ఇన్‌ ‘దేశంలో కుక్క మాంసం తినడాన్ని నిషేదిస్తున్నాం’అని ప్రకటించారు.

Moon Jae-in: ప్రెసిడెంట్‌ కీలక నిర్ణయం..దేశంలో కుక్కల మాంసం తినటం నిషేధం

Dog Meat Ban In South Korea

South Korea president Moon Jae-in dog meet ban : ఇక నుంచి కుక్కల మాంసం తినటానికి వీల్లేదు అంటూ నిషేధం విధించారు దక్షిణి కొరియా ప్రెసిడెంట్‌ మూన్‌ జే-ఇన్‌. సోమవారం (సెప్టెంబర్ 2021)న ప్రధాని కార్యాలయ అధికారులు ‘దేశంలో కుక్క మాంసం తినడాన్ని నిషేదిస్తున్నాం’అని ప్రకటించారు. కాగా దక్షిణా కొరియా వంటకాల్లో కుక్క మాంసం ప్రత్యేకంగా తింటారు. చాలాకాలంగా తినే కుక్క మాంసం ఇక నుంచి తినటానికి వీల్లేదని ప్రకటించటం విశేషం.

దక్షిణ కొరియా వాసులకు కుక్క మాంసం అంటే ఎంత ఇష్టమంటే..సంవత్సరానికి 1 మిలియన్‌ కుక్కల్ని తినేంత ఇష్టం. దీంతో జంతు హక్కుల కార్యకర్తల నుంచి కూడా వ్యతిరేకత పెరుగుతోంది. దక్షిణ కొరియలో పెంపుడు జంతువులను పెంచకోవడం, ఇంట్లో కుక్కలతో నివసించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్‌ జంతు ప్రేమికుడు కావటం విశేషం. ప్రెసిడెంట్ భవనంలో పలు జాతులకు చెందిన కుక్కలను ఆయన పెంచుకుంటున్నారు. అవంటే ఆయనకు ప్రాణం.వాటితో కలిసి ఆయన సరదాగా ఆడుకుంటుంటారు. ప్రతీరోజు వాటితో సమయం గడుపుతుంటారు.

Read more : Viral letters : దాని వల్ల..మాకిష్టమైనవి తినలేకపోతున్నాం అంటూ.. సీఎం,సీఎంలకు ఇద్దరు చిన్నారుల లేఖలు..

ఈక్రమంలో గత సోమవారం ప్రెసిడెంట్ మూన్ జే-ఇన్ ప్రధాని కిమ్‌ బూ-క్యూమ్‌తో మాట్లాడుతూ.. కుక్క మాంసం వినియోగం నిషేదించడాన్ని వివేకంతో పరిగణించాల్సిన సమయం రాలేదా? అంటూ ప్రశ్నించారు. అలా దేశంలో ఇక కుక్క మాంసం తినటంపై నిషేధం విధించారు. దక్షిణ కొరియాలో ఇటువంటి నిర్ణయం తీసుకోవటం మొదటిసారి. దీనికి ప్రెసిడెంట్ మూన్ ప్రధాన కారణం కావటం మరోవిశేషం.

దక్షిణ కొరియా జంతు సంరక్షణ చట్టం.. ప్రధానంగా కుక్కలు, పిల్లుల క్రూరమైన వధను అడ్డుకోవడానికి ఉద్దేశించబడిందే కానీ వినియోగాన్ని నిషేధించలేదు. ఈ క్రమంలో సెప్టెంబర్ లో చేసిన ఓ సర్వే రిపోర్ట్ ప్రకారం 78% మంది కుక్క, పిల్లి మాంసం ఉత్పత్తులను, విక్రయాలను నిషేధించాలని కోరగా, 49% మంది మాంసం వినియోగ నిషేదాన్ని సమర్థించారు. అంటే అక్కడి ప్రజల్లో జనాల్లో చాలా కాలంనుంచి పశువుల కంటే ఎక్కువగా జంతువులను సహచరులుగా చూస్తుండటంతో వీటి వినియోగం తగ్గింది. దీంతో 49 శాతం మంది ప్రజలు కుక్క మాసం వినియోగ నిషేధాన్ని సమర్థించారు.

Read more : Insect Menu : చీమ‌లతో ఐస్‌క్రీమ్‌,చెదపురుగుల ప‌చ్చ‌ళ్లు..బొద్దింకల ఫ్రై..తింటే ఎన్నో లాభాలు !!

మరోపక్క మాంసం వ్యాపారులు మాత్రం ఈ నిర్ణయాన్ని..నిషేధాన్ని వ్యతిరేకిస్తున్నారు. విక్రేతలు మాంసం అమ్మే వృత్తిపై జీవించే తమ పరిస్థితి ఏంటీ? అని ప్రశ్నిస్తున్నారు. మా వృత్తి మా హక్కు అంటూ డిమాండ్ చేస్తున్నారు. మా జీవనోపాధిని దెబ్బతీసే ఈ నిర్ణయాన్ని మేం వ్యతిరేకిస్తున్నామని మమ్మల్ని మా వృత్తిని ప్రమాదంలో పడేస్తున్నారని అంటున్నారు.