బచ్చలికూర మొక్కలు…ఈ మెయిల్స్ పంపిస్తాయి

బచ్చలికూర మొక్కలు…ఈ మెయిల్స్ పంపిస్తాయి

Spinach can send emails now : ఏంటీ బచ్చలి ఆకుకూర మొక్కలు మెయిల్స్ పంపిస్తాయా ? అంత సీన్ లేదు అని అనుకుంటున్నారా ? కానీ ఇది నిజంగానే జరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. టెక్నాలజీ వాడడంతో ఇది సాధ్యమైందంటున్నారు. ఆకుకూరల్లో ఎన్నో రకాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. అందులో బచ్చలికూర కూడా ఒకటి. మంచి పోషకాలుండే ఆహారాల్లో బచ్చలి కూర ముందు వరుసలో ఉంటుంది. అంతేకాకుండా సూపర్ ఫుడ్ గా ప్రసిద్ధి చెందింది. పోషకాలతో పాటు..అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

ఇది పక్కకు పెడితే..భూమిలో, నీటిలో ఏమైనా కాలుష్యాలు ఉంటే..బచ్చలి మొక్కలు వెంటనే మనకు ఈ మెయిల్స్ పంపి అలర్ట్ చేయనున్నాయి. మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. బచ్చలి కూర మొక్కల్లో ఫ్లోరో సెంట్ నానో సెన్సార్ తో కూడిన కార్బన్ నానో ట్యూబులను అమర్చారు. దీంతో ఆ మొక్క వినియోగించుకొనే మృత్తిక (భూ ఉపరితలంపై ఉన్న మెత్తని పొరనే మృత్తిక లేదా నేల అంటారు…మృత్తికలో ఉండే పొరలను ‘హారైజన్స్’ అంటారు), నీటి ద్వారా నైట్రోజన్ డై ఆక్సైడ్ వంటి కాలుష్య పదార్థాలు మొక్క ఆకుల్లోకి ప్రవేశించగానే..కాలుష్యాలున్నాయి..అంటూ…నానో ట్యూబుల్లో ముందుగానే ప్రోగ్రామ్ చేసి పెట్టిన మెయిల్ మెసేజ్…కంప్యూటర్ కు చేరవేస్తుందని వెల్లడిస్తున్నారు.

పర్యావరణ మార్పుల గురించి..శాస్త్రవేత్తలను హెచ్చరించడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు Professor Michael Strano తెలిపారు. ఈ విషయం బయటకు రావడంతో..ప్రజలు మరింత విషయాన్ని వెతికేందుకు ప్రయత్నించారు. పోషకాలు అధికంగా ఉండే..ఈ ఆకకూర ద్వారా మెయిల్స్ ఎలా వస్తాయని వెతికారు. దీంతో ట్విట్టర్ లో ట్రెండింగ్ లో కొనసాగింది. పలువురు కామెంట్స్ చేస్తూ..పోస్టులు చేశారు.