Sri Lanka-Amazon : బికినీలు, ఇన్నర్ వేర్స్ అమ్మటం ఆపండీ..అమెజాన్ కు శ్రీలం సర్కార్ విన్నపం

Sri Lanka-Amazon : బికినీలు, ఇన్నర్ వేర్స్ అమ్మటం ఆపండీ..అమెజాన్ కు శ్రీలం సర్కార్ విన్నపం

Sri Lanka Flag Logo Bikinis And Doormats Amazon Sales

ప్రపంచం అంతాస్మార్ట్ ఫోన్ రూపంలో అరిచేతిలోకి వచ్చిన క్రమంలో ఇప్పుడు షాపింగ్ అంతా ఆన్ లైలే. హలో అంటూ పొలో అంటూ నెట్టింటిలో ఒక్క క్లిక్ చేస్తే చాలు నట్టింటికి నడిచి వచ్చేస్తున్నాయి మనం కోరుకునే వస్తువులు. ఈ క్రమంలో ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌ విక్రయిస్తున్న కొన్ని ఉత్పత్తులపై శ్రీలంక ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ దేశపు జాతీయ జెండా ముద్రించిన బికినీలను అమ్మకాలను సైట్ నుంచి తొలగించాలని శ్రీలంక ప్రభుత్వం అమెజాన్‌ను కోరింది.

బికినీలతో పాటు లోదుస్తులు, డోర్ మ్యాట్స్‌ కూడా అమెజాన్ లో విక్రయించవద్దంటూ కోరింది. దీనికి సంబంధించి శ్రీలంక ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. శ్రీలంక జాతీయ జెండా కలిగిన బికినీలు, ఇతర లోదుస్తులు, డోర్ మ్యాట్‌లు.. ఇలా అనేక చైనా ప్రోడక్టులు అమెజాన్‌లో దర్శనమిచ్చి.. శ్రీలంకను కలవరపరిచాయి. దీంతో శ్రీలంక దేశవ్యాప్తంగా అనేకమంది ఆందోళన వ్యక్తం చేశారు.

దీంతో చైనాపై గుర్రుమన్నారు. తీవ్రంగా మండిపడ్డారు. డ్రాగన్ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చైనా తయారు చేసిన ఈ ఉత్పత్తులకు వ్యతిరేకంగా రెండు రోజుల నిరసనల తర్వాత శ్రీలంక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇలా చేయడం ద్వారా తమ జాతీయ జెండాను, బౌద్ద చిహ్నాలను అగౌరవపరచినట్టుగా శ్రీలంక ప్రభుత్వం భావించింది.

దీనికి సంబంధించి అమెజాన్ సంస్థకు నిరసన తెలియజేసిన శ్రీలంక ప్రభుత్వం.. ఇలాంటి ఉత్పత్తుల తయారీకి, అమ్మకాలకు ఇంతటితో శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టాలని చైనా అధికారులను కోరింది. అలాగే అమెజాన్ సంస్థకు కూడా విన్నవించింది.

శ్రీలంక జాతీయ జెండా లోగో ఉండే దుస్తులను..విక్రయించవద్దని శ్రీలం జాతీయ జెండాను అవమానించేలా ఉన్న అన్ని రకాల ఉత్పత్తులను విక్రయించడాన్ని వెంటనే నిలిపివేయాలని కోరినట్టు చైనాలోని శ్రీలంక ఎంబసీ ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు వాషింగ్టన్‌లోని శ్రీలంక ఎంబసీ అధికారులు ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇది శ్రీలంక మేధో సంపత్తి హక్కులను ఉల్లంఘించడమే అని ఫిర్యాదు చేసింది.