Sri Lanka: డబ్బులు లేక ఎన్నికలు వాయిదా వేసుకున్న శ్రీలంక

ఎన్నికల సంఘం ముందుగా నిర్ణ‌యించిన షెడ్యూల్ ప్ర‌కారం గ‌త నెల తొమ్మిదో తేదీన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌రుగాల్సి ఉంది. కానీ, నిధుల కొర‌త వ‌ల్ల దాన్ని ఈ నెల 25కు వాయిదా వేశారు. గ‌తేడాది ఫిబ్ర‌వ‌రి 21-24 మ‌ధ్య బ్యాలెట్ ప‌త్రాల‌ను ముద్రించ‌డానికి శ్రీ‌లంక ప్ర‌భుత్వ ముద్ర‌ణా సంస్థ అధికారి గంగానీ లియ‌నాగే అనాసక్తి వ్య‌క్తం చేశారు

Sri Lanka: డబ్బులు లేక ఎన్నికలు వాయిదా వేసుకున్న శ్రీలంక

protest in srilanka

Sri Lanka: కొంత కాలంగా తీవ్ర ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్న పొరుగు దేశం శ్రీ‌లంకలో పరిస్థితులు ఇంకా అలాగే ఉన్నాయి. ప్రస్తుతం దేశ పరిస్థితి ఎలా ఉందంటే.. నిధుల కొర‌త కార‌ణంగా ఈ నెల 25న నిర్వ‌హించాల్సిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు నిర‌వ‌ధికంగా వాయిదా వేస్తున్న‌ట్లు ఆ దేశ ఎన్నిక‌ల సంఘం మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. ప్ర‌ధాని దినేష్ గుణ‌వ‌ర్దేణ, ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌తో సంప్ర‌దింపులు జ‌రిపిన మ‌రునాడే ఎన్నిక‌ల సంఘం ఈ ప్ర‌క‌ట‌న చేశారు. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు అవ‌స‌ర‌మైన నిధులు విడుద‌ల చేసినట్లు ఆర్థిక‌శాఖ అధికారులు ధృవీక‌రించిన త‌ర్వాతే ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ తేదీలు ప్ర‌క‌టిస్తామ‌ని శ్రీ‌లంక ఎన్నిక‌ల సంఘం డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ స‌మ‌న్‌శ్రీ ర‌త్నాయ‌కే తాజాగా ప్రకటించారు.

Rajasthan: సచిన్ పైలట్ మీద మరోసారి క్రమ శిక్షణ చర్యలు తీసుకోనున్న కాంగ్రెస్!

అయితే ఎన్నికల సంఘం ముందుగా నిర్ణ‌యించిన షెడ్యూల్ ప్ర‌కారం గ‌త నెల తొమ్మిదో తేదీన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌రుగాల్సి ఉంది. కానీ, నిధుల కొర‌త వ‌ల్ల దాన్ని ఈ నెల 25కు వాయిదా వేశారు. గ‌తేడాది ఫిబ్ర‌వ‌రి 21-24 మ‌ధ్య బ్యాలెట్ ప‌త్రాల‌ను ముద్రించ‌డానికి శ్రీ‌లంక ప్ర‌భుత్వ ముద్ర‌ణా సంస్థ అధికారి గంగానీ లియ‌నాగే అనాసక్తి వ్య‌క్తం చేశారు. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు 500 మిలియ‌న్ రూపాయ‌లు ఖ‌ర్చ‌వుతుండ‌గా, కేవ‌లం 40 మిలియ‌న్ రూపాయలు మాత్ర‌మే వ‌చ్చాయ‌ని గంగానీ లియానాగే తెలిపారు. శ్రీ‌లంక‌లో 340 లోక‌ల్ కౌన్సిళ్ల‌కు కొత్త పాల‌క మండ‌లి ఏర్పాటు కోసం ఎన్నిక‌లు జ‌రుగాల్సి ఉంది. వీరి ప‌ద‌వీ కాలం నాలుగేండ్లు ఉంటుంది. గ‌డువు ప్ర‌కారం గ‌తేడాది మార్చిలో జ‌రుగాల్సి ఉంది. కానీ, ఆర్థిక సంక్షోభం వ‌ల్ల గ‌తేడాది నుంచి స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ వాయిదా ప‌డుతూ వ‌స్తున్నాయి.