Sri Lanka: ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి మా ముందు ఉన్న ఒకే ఒక్క దారి ఇది: శ్రీలంక అధ్యక్షుడు

ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి శ్రీలంక ముందు ఉన్న ఒకే ఒక్క దారి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ మద్దతును కోరడమేనని ఆ దేశ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే అన్నారు. శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కుదేలైన సంగతి అందరికీ తెలిసిందేనని చెప్పారు. ద్రవ్యోల్బణం పెరగడం వల్ల జీవన వ్యయం పెరిగిపోయిందని తెలిపారు.

Sri Lanka: ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి మా ముందు ఉన్న ఒకే ఒక్క దారి ఇది: శ్రీలంక అధ్యక్షుడు

Sri Lanka

Sri Lanka: ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి శ్రీలంక ముందు ఉన్న ఒకే ఒక్క దారి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ మద్దతును కోరడమేనని ఆ దేశ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే అన్నారు. శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కుదేలైన సంగతి అందరికీ తెలిసిందేనని చెప్పారు. ద్రవ్యోల్బణం పెరగడం వల్ల జీవన వ్యయం పెరిగిపోయిందని తెలిపారు. తమ దేశం ఎదుర్కొంటున్న ఇబ్బందులు తనకు తెలుసని చెప్పారు.

తమ ప్రజల జీవన శైలి మారిపోయిందని తెలిపారు. ఇంతకు ముందు శ్రీలంకలో బలంగా ఉన్న రంగాలు కూడా ఇప్పుడు కుప్పకూలిపోతున్నాయని చెప్పారు. విద్య, ఆరోగ్య రంగాలు సహా శ్రీలంకలోని అన్ని రంగాలపై ప్రతికూల ప్రభావం పడిందని అన్నారు. ఇవన్నీ ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడం వల్ల తలెత్తిన పరిణామాలని చెప్పారు.

దీనికి దారి తీసిన పరిస్థితుల గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం అనవసరమని, ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని అన్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ మద్దతు లేకపోతే తమ దేశం కోలుకునే అవకాశమే లేదని చెప్పారు. మళ్ళీ రుణాలు పొందేందుకు అనుసరించాల్సిన చర్యలపై దృష్టి పెట్టి దాని ద్వారా శ్రీలంక ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని ప్రయత్నాలు జరుపుతున్నామని అన్నారు. ఇప్పటికే తాము జపాన్, చైనా, భారత్ తో ఇప్పటికే చర్చలు ముగించామని తెలిపారు.

Ukraine war: తొమ్మిది అంతస్తుల అపార్ట్‌మెంట్‌పై క్షిపణితో దాడి చేసిన రష్యా.. వీడియో