Sri Lanka : విమానాలు ఢీకొట్టుకునే పెను ప్రమాదాన్ని తప్పించి 525 మంది ప్రాణాలను కాపాడిన శ్రీలంక పైలట్లపై ప్రశంసలు

Sri Lanka pilot refused order to climb to 35000 feet : రోడ్డుమీదే కాదు గాల్లో కూడా ప్రమాదాలు జరుగుతాయి కొన్నిసార్లు. అలా రెండు విమానాలు ఢీకొట్టుకునే ప్రమాదం తృటిలో తప్పింది. ఇది పైలెట్ల చాకచక్యంతో పెను ప్రమాదం తప్పింది. లేదంటే వందలాదిమంది ప్రాణాలు కోల్పోయేవారు. తుర్కియే మీదుగా ప్రయాణిస్తున్న బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానం.. లండన్- కొలంబో వెళ్తున్న శ్రీలంక ఎయిర్‌లైన్స్ విమానం ఒకదానికొకటి అత్యంత సమీపంగా వచ్చాయి. అయితే ఫైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. విమానాన్ని సురక్షితంగా నడిపి ప్రమాదాన్ని తప్పించించడంతో శ్రీలంక తమ పైలట్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. రెండు రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గాల్లో విమానాలు ఢీకొట్టుకునే పెను ప్రమాదాన్ని తప్పించి 525 మంది ప్రాణాలను కాపాడిన శ్రీలంక పైలట్లపై ప్రశంలస వర్షం కురుస్తోంది. శ్రీలంక ఎయిర్‌లైన్స్‌కు చెందిన యూఎల్-504 విమానం జూన్ 13న లండన్ నుంచి 275 మంది ప్రయాణికులతో కొలంబో బయలుదేరింది. విమానం టర్కీ గగనతలం పైనుంచి 33 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో విమానాన్ని 35 వేల అడుగులకు తీసుకెళ్లాలని అంకారా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) నుంచి పైలట్లకు ఆదేశాలు అందాయి.
ఈ క్రమంలో అదే హైట్ లో మరో విమానం వస్తోందని..అది అత్యం సమీపానికి వచ్చేసిందని..కేవలం 15 మైళ్ల దూరంలోనే ఉందని శ్రీలంక పైలట్లు గుర్తించారు. దీంతో వెంటనే అప్రమత్తమయ్యారు. విషయాన్ని ఏటీసీ దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ పట్టించుకోని ఏటీసీ పైకి వెళ్లేందుకు రెండుసార్లు క్లియరెన్స్ ఇచ్చింది. అయితే, ప్రమాదాన్ని ఊహించిన శ్రీలంక పైలట్లు 35 వేల అడుగుల ఎత్తుకు వెళ్లేందుకు అంగీకరించలేదు.
ఆ తర్వాత తమ పొరపాటును గుర్తించిన ఏటీసీ పైకి వెళ్లవద్దని..అదే ఎత్తులో దుబాయ్ వెళ్తున్న బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం 250 మందితో వస్తోందని శ్రీలంక పైలట్లకు సమాచారం ఇచ్చింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఏటీసీ మొదట ఇచ్చిన ఆదేశాలను పైలట్లు పాటించి ఉంటే 525 మంది ప్రాణాలు గాలిలో కలిసి పోయి ఉండేవని మా పైలెట్లు చక్కగా వ్యవహరించారని శ్రీలంక ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. పైలట్లు సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందంటూ ప్రశంసించింది. కొలంబోలోని బండారునాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో తమ విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని తెలిపింది. సిబ్బందితో పాటు ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని పేర్కొంది. ఈ ఘటనపై నివేదిక సమర్పించామని వెల్లడించింది.
1Maharashtra: మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ షిండే.. నేడే ప్రమాణ స్వీకారం: ఫడ్నవీస్ ప్రకటన
2Bunny Vas: మరోసారి కథనే నమ్ముకున్న GA2 పిక్చర్స్
3Oppo Reno 8 Series : ఒప్పో రెనో 8 వచ్చేస్తోందోచ్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
4Maharashtra: ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్‌కు లేఖ అందించిన ఫడ్నవీస్, షిండే
5PM Modi will taste Yadamma cooking : ప్రధాని మోడీ సార్ కు వంట చేసే అవకాశం దక్కటం నా అదృష్టం : యాదమ్మ
6Manipur landslide: మణిపూర్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. ఏడుగురు జవాన్లు మృతి.. 45మంది గల్లంతు
7Pigeon Droppings : పావురాల వ్యర్ధాలతో శ్వాసకోశ జబ్బులు!
8Maharashtra: ‘హరహర మహాదేవ..’ అంటూ సీఎం ఉద్ధవ్ రాజీనామాపై హీరోయిన్ కంగన స్పందన
9వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేలకు టార్గెట్ ఫిక్స్ చేసిన జగన్
10Anupama Parameswaran: కార్తికేయ కోసం ఆ పని ముగించేసిన అనుపమ!
-
Major: మేజర్ కూడా రెడీ.. కాస్కోండి అంటోన్న నెట్‌ఫ్లిక్స్!
-
Rheumatic Fever : చిన్నారుల గుండెపై ప్రభావం చూపే రుమాటిక్ ఫీవర్!
-
Jack Fruit : మధుమేహాన్ని నియంత్రణలో ఉంచే పనస పండు!
-
Aloo Bukhara : ఆలూ బుఖారాతో అనారోగ్యాలకు చెక్!
-
Academic Year Calendar : తెలంగాణ 2022-23 విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదల
-
Uddhav Thackeray Resign : బలపరీక్షకు ముందే.. సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా
-
Nothing phone (1) : నథింగ్ ఫోన్ (1) ఫోన్ కొత్త ఫీచర్ అదిరిందిగా.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Rains : తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు