Sri Lanka Burkhas: బుర్ఖా, ఫేస్ కవరింగ్‌లను నిషేదించిన శ్రీలంక ప్రభుత్వం

జాతీయ భద్రత దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో బుర్ఖా, ఇతర ఫేస్ కవరింగ్ లను నిషేదిస్తున్నట్లుగా ప్రకటించింది ప్రభుత్వం. పబ్లిక్ సెక్యూరిటీ మినిష్టర్ శరత్ వీరశేఖర క్యాబినెట్ ఆర్డర్‌పై సంతకం చేశారు. దీనిపై పార్లమెంటరీ అప్రూవల్ మాత్రమే రావాల్సి..

Sri Lanka Burkhas: బుర్ఖా, ఫేస్ కవరింగ్‌లను నిషేదించిన శ్రీలంక ప్రభుత్వం

Sri Lanka to ban burka

Sri Lanka Burkhas: జాతీయ భద్రత దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో బుర్ఖా, ఇతర ఫేస్ కవరింగ్ లను నిషేదిస్తున్నట్లుగా ప్రకటించింది ప్రభుత్వం. పబ్లిక్ సెక్యూరిటీ మినిష్టర్ శరత్ వీరశేఖర క్యాబినెట్ ఆర్డర్‌పై సంతకం చేశారు. దీనిపై పార్లమెంటరీ అప్రూవల్ మాత్రమే రావాల్సి ఉంది. అది కూడా మరింత త్వరగా అమలు చేస్తామని అధికారులు అంటున్నారు.

రెండేళ్ల క్రితం ఈస్టర్ సండే సందర్భంగా హోటల్స్, చర్చిలపై దాడులు జరిగిన దాని ప్రభావంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 2019లో సూసైడ్ బాంబర్స్ టార్గెట్ చేసి క్యాథలిక్ చర్చిలు, టూరిస్ట్ హోటల్స్ లలో 250మందికి పైగా చనిపోవడానికి కారణమయ్యారు. దాంతో దాడికి పాల్పడే వారిని అడ్డుకోవడానికి తాత్కాలికంగా ఫేస్ కవరింగ్స్ వంటివి నిషేదించింది.

ఇప్పుడు అదే నిర్ణయాన్ని పార్లమెంట్ బేసిస్ మీద గవర్నమెంట్ రీ ఇంట్రడ్యూస్ చేసే పనిలో పడింది. మతపరమైనది అయినప్పటికీ జాతీయ భద్రత కారణంగా బుర్ఖా, ఫేస్ కవరింగ్స్ ను శాశ్వతంగా నిషేదించాలని అనుకుంటున్నాం. అతి త్వరలోనే దీనిని అమలు చేస్తాం అని వీరశేకర వెల్లడించారు.

నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీకి వ్యతిరేకంగా ఉన్న వెయ్యి మదరసాలను కూడా నిషేదించాలని ప్రభుత్వం ప్లాన్ చేయాలనుకుంటున్నట్లు చెప్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు అనుసరించి ఏ స్కూల్ అయినా ఓపెన్ చేసి టీచింగ్ చేసుకోవచ్చు. చాలా వరకూ రిజిష్ట్రేషన్ లేని స్కూల్స్ అరబిక్ లాంగ్వేజ్ బోధించడం, ఖురాన్ నేర్పించడం వంటివి జరుగుతున్నాయని అన్నారు.